జగన్ ఓదార్పు బాటలో రాహుల్ ప్రయాణం

ఓదార్పు యాత్ర అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే. ఆ తరువాత ఆయన సందించిన బాణం షర్మిలా గుర్తుకు వస్తారు. ఓదార్పు యాత్రల వలన రెండు ప్రయోజనాలున్నాయి. 1. స్థానిక ప్రజలను ఆకట్టుకోవడం. 2. స్థానిక సమస్యని లేదా బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరూపించవచ్చును. త్రేతాయుగం నుండి ఈ ఓదార్పు యాత్రలు మొదలయినట్లు దాఖలాలు ఉన్నప్పటికీ ఈ కలియుగంలో మాత్రం ఒక్క జగన్ వల్లనే వాటికి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పక తప్పదు. కనుక ఓదార్పు యాత్రలపై పేటెంట్ హక్కులు అన్నీ ఆయనకే ఉంటాయి.

కానీ అదేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎడాపెడా ఓదార్పు యాత్రలు చేసేస్తున్నారు. ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి అదిలాబాద్ లో రైతు భరోసా యాత్ర పేరు పెట్టుకొని ఓదార్పు యాత్ర చేసేసారు. తరువాత అనంతపురంలో కూడా లాగించేసారు. జగన్ తన ఓదార్పు యాత్రలలో భాదిత కుటుంబాలకి చెక్కులు పంచుతున్నారో లేదో తెలియదు కానీ రాహుల్ గాంధీ మాత్రం చెక్కులు పంచుతున్నారు. తన జేబులో నుంచి కాకపోయినా స్థానిక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన చెక్కులను పంచుతున్నారు. కానీ ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా పార్టీని బలోపేతం చేసుకోకపోతే అధికారంలోకి రాలేమనే జగన్ అనుభవసారాన్ని గ్రహించకుండా మళ్ళీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఓదార్పు యాత్రకి బయలుదేరిపోతున్నారు.

ఆ రాష్ట్రంలో పూంచ్ సెక్టర్లో సరిహద్దు గ్రామాలపై ఇటీవల పాక్ దళాల కాల్పులలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఈరోజు రాహుల్ గాంధీ బయలుదేరుతున్నారు. కానీ రాహుల్ బాబు వచ్చేరని పాక్ దళాలు కాల్పులు ఆపుతాయో లేదో తెలియదు. అందుకే జర భద్రం కొడకో..అని జాగ్రత చెప్పి మరీ పంపిస్తున్నారు రాజమాత. కానీ జగన్ మొదలు పెట్టిన ఈ ఓదార్పు యాత్రలను అందిపుచ్చుకొన్న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ బోర్డర్ వరకు కూడా దానిని తీసుకుపోతున్నారు. కనుక పాకిస్తాన్ వాళ్ళకి ఈ ఓదార్పు యాత్రల గురించి తెలిస్తే వాళ్ళూ దానిని రాహుల్ బాబు నుండి అందిపుచ్చుకొంటే అలాగా క్రమంగా అన్ని దేశాలలో మన ఓదార్పు యాత్ర విస్తరించే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close