రవి : ఇది ఆంధ్రా ఆత్మాభిమానంపై నిట్టనిలువుగా జరిగిన దాడి..!

తెలంగాణ పోలీసులు ఏపీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు..! తెలంగాణ ప్రభుత్వం ఏపీని సామంతరాజ్యంగా ఇప్పటికే పరిగణించడం ప్రారంభించింది..! తెలంగాణ పోలీసులతో ఏపీ వ్యవస్థనే ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు..! అధికారం కోసం మోకాళ్ల మీద వంగిపోయిన కొంత మంది వ్యక్తుల స్వార్థాన్ని అడ్డు పెట్టుకుని ఏపీని జీవం లేని శవంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు…!. ఏపీ ప్రజల ఆత్మాభిమానంపై నిట్టనిలువుగా దాడి చేస్తున్నారు..!

ఏపీపై వ్యవహారాలపై తెలంగాణ పోలీసులకు ఏం సంబంధం ..?

కేసు ఏమిటి..? ఫిర్యాదులేమిటి..?
ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీ చేయడం..!
ప్రభుత్వ లబ్దిదారుల జాబితా చోరీ చేయడం..!
వ్యక్తిగత సమాచారం బయటకు రావడం..!
ఓటర్ల జాబితాలను మానిపులేట్ చేయడం..!
ఎవరు ఫిర్యాదు చేశారు..?
తెలంగాణలో నివసరించే లోకేశ్వర్ రెడ్డి..!
ఈ లోకేశ్వర్ రెడ్డి ఎవరు..? ఏపీ ప్రభుత్వ అధికారినా..? ఏపీ ప్రభుత్వ లబ్దిదారుడా..? కానే కాదు..! మరి ఏ హోదాలో ఫిర్యాదు చేశారు..? ఆ ఫిర్యాదును తెలంగాణ పోలీసులు ఎలా తీసుకున్నారు..? తీసుకుని హుటాహుటిన ఎందుకు ఐటీ కంపెనీపై దాడులకు పాల్పడ్డారు..?నిజానికి ప్రభుత్వ రహస్య సమాచారం ఏదైనా బయటకు వెళ్లిందంటే.. దాన్ని ధృవీకరించాల్సింది ప్రభుత్వం. ధృవీకరించి ఫిర్యాదు చేయాల్సింది సంబంధింత అధికారులు. అప్పుడే ఆ ఫిర్యాదుకు విలువ ఉంటుంది. పోనీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే.. ఆ మేరకు.. ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. కానీ ఇక్కడ.. అసలు అధికారికంగా ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే… ప్రైవేటు వ్యక్తులతో పిర్యాదులు చేయించి… ఏపీపై దాడి ప్రారంభించారు. అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు .. ఏపీ ప్రభుత్వ అధికార వ్యవహారాలపై ఫిర్యాదులు చేయడం ఏమిటి..? దానిపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టడం ఏమిటి..? సాఫ్ట్ వేర్ కంపెనీపై దాడులు చేయడం ఏమిటి..?

తెలంగాణ పోలీసులపై ఏపీపై దండయాత్ర చేస్తున్నారా…?

వైసీపీ నేతలు కట్టకట్టుకని.. తెలంగాణకు ఎందుకు వెళ్తున్నారు. తెలంగాణ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో.. ప్రబుత్వ పథకాల లబ్దిదారుల సమాచారం మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చారు. దాని ప్రకారం.. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి… టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారన్న విమర్శలకు కూడా వచ్చాయి. అది డేటా దొంగతనం చేయడం కాదా..? . అలాంటి దాన్నే అడ్డం పెట్టుకుని ఏపీపై దండయాత్ర చేయడం ఎందుకు..?. అసలు డేటా బ్రీచ్ జరిగిందో లేదో ఇంత వరకు పోలీసులు తేల్చలేదు. కానీ.. కేటీఆర్ మాత్రం.. ఎందుకు… తీర్పులిచ్చేస్తున్నారు..? ఏపీ అంటే తెలంగాణ నేతలకు అంత అలుసుగా మారిందా..?. అక్రమంగా నిర్బంధించారని కోర్టుకు వెళ్లడం కూడా తప్పేనా..? ఎందుకు నిర్బంధించారని కోర్టు మొట్టికాయలేసినా సిగ్గుపడకుండా.. ఏపీపై దాడి చేయడం ఏమిటి..?

గెలవకుండానే ఏపీని తెలంగాణ కాళ్లపై పెట్టేశారా..?

సొంతంగా గెలిచే సామర్థ్యం లేక.. ఎవరో గెలిపిస్తారనే ఆశలతో.. కొంత మంది.. తెలంగాణ నేతల కాళ్లపై పడిపోతున్నారు. వారి దగ్గర పోలీసులు ఉన్నారు… హైదరాబాద్‌లో దశాబ్దాలుగా ఉండి వెళ్లారు కాబట్టి.. అక్కడ ఎన్నో కొన్ని లింకులు ఉంటాయి కాబట్టి… ఏదో విధంగా.. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని… టీడీపీని ఇబ్బంది పెట్టి.. ఏపీని సామంతరాజ్యంగా చేసేసి… అధికారం చేసేసి .. ఏం సాధిద్దామనుకుంటున్నారు…? ప్రతిపక్షంలో ఉండి.. తెలంగాణ మోచేతి నీళ్లు తాగి.. ఏపీలో ఓ పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి.. అధికారం సాధిస్తే.. ఏపీ ప్రయోజనాలను వాళ్లు ఎలా రక్షిస్తారు..?. కచ్చితంగా ఇది.. ఏపీ ప్రజల ఆత్మాభిమానంపై .. నిట్టనిలువుగా జరుగుతున్న.. దాడి. దీనికి ఆంధ్రులపై విషం చిమ్మే.. టీఆర్ఎస్ సర్కార్‌కు… కొంత మంది ఆంధ్రులు ఏ మాత్రం సిగ్గుపడకుండా సహకరిస్తున్న ఫలితమే ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close