శ్రీను వైట్ల మార్క్ సినిమాల్లో బ్రహ్మానందం మెయిన్ పాయింట్ గా ఉంటారు. ఓ రకంగా ఆయనే హీరో. ఆయనను ముందు పెట్టి అందరూ అన్ని పనులు చేసేస్తూంటారు. ఏం జరుగుతుందో తనకు తెలియదు… కానీ అంతా తన వల్ల జరిగిపోతుదంన్న ట్రాన్స్ లో ఉంటాడు. అచ్చంగా అలానే రాజ్ కెసిరెడ్డిని లిక్కర్ స్కాం కింగ్ పిన్స్ వాడుకున్నారు. ఆయనకు చిల్లర పడేసి.. మిగతా మొత్తం తాము దోచుకున్నారు. రాజ్ కెసిరెడ్డికి అప్పట్లో అర్థం కాలేదు కానీ.. నిండా మునిగిపోయాక ఇప్పుడు అర్థమవుతోంది. అప్పట్లో ఇచ్చిన చిల్లర కూడా ఇప్పుడు తనకు మిగలదని పైగా.. జీవితం జైలు పాలవుతోందని ఆయనకు అర్థమయ్యే తరుణం వచ్చేసింది.
మద్యం స్కాం కోసం బకరాల్ని ముందుగానే చూసుకున్న దోపిడీ టీం
అధికారం అందినట్లుగా తెలియగానే.. ఎలా సంపాదించాలన్న దానిపై శిఖరాగ్ర సమావేశాలను వైసీపీ పెద్దలు నిర్వహించారు. సంపాదిస్తే దొరికిపోవడం ఖాయం. అప్పట్లా పెట్టుబడులతో కథ నడిపించే పరిస్థితి లేదు. అందుకే దొరికిపోతారు..కానీ ఆ దొరికిపోయే వారిని కూడా ముందుగానే రెడీ చేసుకుని.. అసలు లాభం తాము పొంది..కొంత కమిషన్ వారికి ఇస్తే సరిపోతుందనుకున్నారు. అంటే ఎకరాల్ని రెడీ చేసుకోవాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా రైల్వేలో పని చేసే వాసుదేవరెడ్డిని.. ఐ ప్యాక్ కోసం పని చేయడానికి వచ్చిన రాజ్ కెసిరెడ్డిని ముందు పెట్టారు. దోచుకున్నంత దోచుకున్నారు. ఇప్పుడు వారు ఇరుక్కుపోయారు.
వి.సా.రెడ్డి ..రాజ్ కెసిరెడ్డిని టార్గెట్ చేయడం వెనుక వ్యూహం అదే !
లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డి అనే వ్యక్తి కమిషన్ బేసిస్ మీద వ్యవహారాలు నడిపాడు అంతే. కానీ కంపెనీలు అతనివే అని చెప్పేందుకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు వంద కోట్లు అప్పులు ఇప్పించడం వంటివి చేశారు. నిజానికి ఆ కంపెనీలు రాజ్ కెసిరెడ్డివే అని ఆయనను నమ్మించి ఉంటారు. ఆ కంపెనీలతో దందాలు చేసింది ఎవరో అందరికీ తెలుసు. తాము బయటపడి.. రాజ్ కెసిరెడ్డిని ఇరికిస్తే చాలని అనుకున్నారు. అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు రాజ్ కెసిరెడ్డికి ఈ కుట్ర గురించి స్పష్టత వచ్చి ఉంటుంది. మరి ఆయన మొత్తం చెబుతారా లేకపోతే… వచ్చిన కమిషన్ కోసం తాను జైలుకెళ్లినా పర్వాలేదు.. అందర్నీ కాపాడాలనుకుంటారా అన్నది కీలకం.
రాజ్ కెసిరెడ్డి నిజం చెప్పకపోయినా.. మొత్తం గుట్ట రట్టు !
రాజ్ కెసిరెడ్డిని ఇప్పటి వరకూ కాపాడింది వైసీపీ పెద్దలే. సీఐడీ ఎదుట హాజరవుతాను అని చెప్పి.. పోలీసుల దృష్టి తన మీద లేకుండా చూసుకుని ఆయన విదేశాలకు జంప్ అవ్వాలనుకున్నారు. ఫేక్ పేపర్లు రెడీ చేసుకున్నారు. ఇదంతా వైసీపీకి చెందిన కొంత మంది కనుసన్నల్లోనే జరిగింది. కానీ సిట్ అధికారులు పట్టేసుకున్నారు. ఇంత తెలుసకున్న సిట్ అధికారులు లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో తెలుసుకోలేరా?. ఇప్పటికే విచారణలో లెక్కకు మించి సాక్ష్యాలు దొరికాయి. అసలు దొంగల్ని పట్టుకోవడానికే ఇప్పుడు వారు చేస్తున్న ప్రయత్నాలు.