విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్ డమ్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత దిల్ రాజు బ్యానర్లో ‘రౌడీ జనార్థన్’ మొదలు కానుంది. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకుడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం రాజశేఖర్ ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాజశేఖర్ పై ఓ ఫొటో షూట్ కూడా చేశారని, చిత్రబృందం అన్ని విధాలా సంతృప్తిగా ఉందని, రాజశేఖర్ కి కూడా మంచి పారితోషికం కోడ్ చేశారని సమాచారం అందుతోంది.
ఈ రౌడీకి రాజశేఖర్ తోడైతే కచ్చితంగా కాంబో కొత్తగా ఉంటుంది. రాజశేఖర్‌కు ఇటీవల క్యారెక్టర్, విలన్ పాత్రలు బాగానే వస్తున్నాయి. కాకపోతే తానే ఒప్పుకోవడం లేదు. చాలా ఆఫర్లు రాజశేఖర్ వదులుకొన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇలాంటి క్రేజీ సినిమాల్లో ఆఫర్లు అందుకొంటే కచ్చితంగా రాజశేఖర్ మళ్లీ ఫామ్ లోకి వస్తారు.
`రౌడీ జనార్థన్` ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్ మూవీ. కథానాయికగా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తోంది. రష్మిక నటిస్తే వారిద్దరికీ హ్యాట్రిక్ కాంబో అవుతుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తరవాత విజయ్ – రష్మిక నటించే సినిమా ఇదే అవుతుంది.