అంథ‌గాడు టీజ‌ర్‌.. న‌వ్వులు మిస్స్‌స్స్‌

రాజ్‌త‌రుణ్ త‌న కెరీర్‌లో తొలిసారి ఓ ప్ర‌యోగం చేస్తున్నాడు. త‌న కొత్త సినిమాలో అంధుడిగా క‌నిపించ‌బోతున్నాడు. టైటిల్ కూడా వెరైటీగా అంధ‌గాడు అని పెట్టారు. హెబ్బా ప‌టేల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. టీజ‌ర్ ఈరోజు బ‌య‌ట‌కు వ‌దిలారు. టీజ‌ర్లో పెద్ద‌గా మెరుపులేం లేవు. టైటిల్ కి జ‌స్టిఫికేష‌న్ ఇచ్చే కొన్ని షాట్లూ, డైలాగులు త‌ప్ప‌. ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని న‌మ్ముకొన్న‌ట్టు క‌నిపిస్తోంది గానీ, ఆ వినోదం ఏ స్థాయిలో ఉండ‌బోతోందో మ‌చ్చుక్కి కూడా చెప్ప‌లేదు. ఆఖ‌ర్లో క‌ళ్లు లేని వాళ్ల‌ని రోడ్డు దాటించాల‌నుకొనేవాళ్ల‌పై ఓ సెటైర్ వేశాడు రాజ్ త‌రుణ్‌. ఆ డైలాగ్ స‌గం న‌మిలి, స‌గం మింగేసిన‌ట్టు అస్ప‌ష్టంగా వినిపిస్తోంది. క్యారెక్ట‌ర్ ప‌రంగా స్పీడు ఓకే… డైలాగుల్లోనూ అదే స్పీడు చూపించాల‌నుకొంటే స‌గం స‌గ‌మే అర్థ‌మ‌వుతాయి. కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ఓ హిట్టు కొట్టిన రాజ్ త‌రుణ్‌… అదే స్పీడు కంటిన్యూ చేయాలంటే అంధ‌గాడునీ గ‌ట్టెక్కించాల్సిందే. కామెడీ ని న‌మ్ముకొంటే క‌చ్చితంగా రాజ్‌త‌రుణ్ ఖాతాలో మ‌రో హిట్ చేయ‌డం ఖాయం. కానీ.. అదే ఈ టీజ‌ర్‌లో మిస్స‌య్యింది. తెర‌పై ఏం చేస్తారో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close