బాబు, జగన్, పవన్……జనాభిమానం కోసమా? మోసం చేయడానికా?

ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానాన్ని గెలుచుకోవాలి, ప్రజల కోసం పనిచేస్తామన్న నమ్మకాన్ని వాళ్ళకు కలిగించాలి లాంటి సిద్ధాంతాలను ఎప్పుడో పాతిపెట్టేశారు మన నాయకులు. ఎన్నికల్లో గెలవాలంటే జనాలను నమ్మించే స్థాయి హామీలివ్వాలి. నాకంటే పోటుగాడు లేడని జనాలను నమ్మించాలి. నేను మాత్రమే దిక్కని వాళ్ళను మానసికంగా సిద్ధం చెయ్యాలి. అవతలి వాడు అధికారంలోకి వస్తే సర్వం నాశనం అని చెప్పి భయపెట్టాలి. ప్రత్యర్థులపైన వీలైనంత బురద చల్లాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలది ఇదే సిద్ధాంతం. మొన్నటి వరకూ ఈ సిద్ధాంతాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి భజన మీడియా జనాభా సరిపోయేదికానీ మోడీవారి పుణ్యమాని ఇప్పుడు స్ట్రాటజిస్ట్‌లు బాగా పాపులర్ అయ్యారు.

మోడీ ప్రధాని అవడంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రతిభ ఎంతో ఉందని స్వయానా బిజెపి నాయకులే చాలా సార్లు చెప్పారు. మోడీని ప్రధానిని చేసిన అంతటి సమర్థవంతుడిని ప్రధాని పదవి కోసమే పెళ్ళిని కూడా త్యాగం చేసిన రాహుల్ గాంధీ వదులుకుంటాడా? ఇక ముఖ్యమంత్రి కుర్చీ కోసమే ఊపిరి ఊపిరి అల్లుకుని బ్రతుకుతున్నా అనే స్థాయిలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి కలలుగంటున్న పులివెందుల పులి జగన్ మాత్రం ప్రశాంత్ కిషోర్‌ని అక్కున చేర్చుకోడా? కానీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు రాహుల్, జగన్‌లకు పెద్దగా వర్కవుట్ అవుతున్నట్టుగా లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాహుల్ చేత ప్రశాంత్ కిషోర్ చేయించిన మంచాల ప్రచారం ప్రోగ్రాం పిచ్చ కామెడీ అయిపోయింది. కామెడీ పొలిటీషియన్ అని రాహుల్ పైన ఉన్న ముద్రను శాశ్వితం చేసి పడేసింది. ఇక ఇప్పుడు జగన్‌ని కూడా ఈ ప్రశాంత్ కిషోర్ దెబ్బేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘పొలిటికల్ పంచ్’ ఫేస్ బుక్ పేజీ చుట్టూ జరుగుతున్న రాజకీయం తెలుసుగా. అసలు ఆ పొలిటికల్ పంచ్ ఐడియా ప్రశాంత్ కిషోర్‌దేనని తెలుస్తోంది. ఆ రకంగా మొదటి స్ట్రాటజీతోనే జగన్‌కి చిక్కులు తెచ్చిపెట్టాడు కిషోర్. 2019 ఎన్నికల వరకూ ఈ ప్రశాంత్ కిషోర్ వారు జగన్‌ చేత ఇంకెన్ని స్ట్రాటజీలు చేయిస్తాడో చూడలి మరి.

ఈ విషయంలో జనసేన, టిడిపి అభిమానులు కూడా ఫికర్ అవ్వాల్సింది ఏమీలేదు. జనసేన అధినేత పవన్ కూడా విదేశాల నుంచి స్ట్రాటజిస్ట్‌లను దింపుతున్నాడు. ఇక 1983 నుంచి ఉన్న ఇలాంటి స్ట్రాటజిస్ట్‌లకే స్ట్రాటజిస్ట్ లాంటి రాజగురువు, మీడియా మొఘల్ ఉండగా చంద్రబాబుకు చింత ఏల? అలాగే ఎన్నికలు ఉన్నా లేకపోయినా…..ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మంచికీ చంద్రబాబు కారణం, చెడుకు జగన్ కారణం అని చెప్పే ఇంకో ఓపెన్ హార్ట్ సర్జన్‌తో పాటు పంచ్ డైలాగులు పేల్చే సినిమా రైటర్స్, గ్లామరసాన్ని అద్భుతంగా తెరకెక్కించే సినిమా డైరెక్టర్….ఇలాంటి వాళ్ళందరూ ఉండగా చంద్రబాబుకు వేరే స్ట్రాటజిస్ట్‌లతో పని ఏమి ఉంది?

స్ట్రాటజీలు, జిమ్మిక్కులు, పాలిట్రిక్స్, ప్రచార పటాటోపాలు…..ఎన్నికల కోసం ఇలాంటి విద్యలను ఫాలో అవుతున్నారంటే… మన నాయకులు ప్రజలను మోసం చేయడం ఎలా అనే విషయంపైనే కాస్తంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారేమో అన్న అనుమానం రావడం లేదూ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close