ఎన్టీఆర్, చరణ్… ఇద్దరూ మంచి స్నేహితులు. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే వీళ్ల స్నేహం ఉంది. అదెంత స్ట్రాంగో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సెట్ పై వీళ్ల కెమిస్ట్రీ ఎలా కుదిరిందో సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ఇప్పటికైతే మీడియా ఇంట్రాక్షన్స్ లో, ఇంటర్వ్యూలలో.. ఇద్దరి బంధం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ `మా చరణ్… మా చరణ్` అంటూ చర్రీని ఇంకా ఇంకా ఓన్ చేసుకుంటున్నాడు. చరణ్ కూడా `తారక్.. తారక్` అంటూ ప్రతీసారీ తన నామ జపమే చేస్తున్నాడు. వీరిద్దరూ ఎంత క్లోజ్ అయిపోయారంటే, ఒకరి బలహీనతలు కూడా మరొకరు చెప్పుకునేంతగా. తాజాగా చరణ్ బలహీనతేమిటో ఎన్టీఆర్… బయటపెట్టేశాడు.
ఎన్టీఆర్, చరణ్‌లతో.. కీరవాణి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లకు సంబంధించిన ఇంటర్వ్యూ ఇది. అయితే ఇందులో ఆ సినిమాకి సంబంధించిన ప్రశ్నలేవీ లేవు. కేవలం సంగీతం, వ్యక్తిగతం చుట్టూనే తిరిగాయి. ఈ సందర్భంగా చరణ్ లో మైనస్‌ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. చరణ్‌కి వ్యక్తుల పేర్లేమీ గుర్తుండవట. ఆ పేర్లు రిజిస్టర్ చేసుకోవడానికే చరణ్‌కి చాలా సమయం పడుతుందని చెప్పాడు చరణ్. పేర్లు తప్పు తప్పుగా పలుకుతాడని, పేరులోని తొలి అక్షరం, చివరి అక్షరమే కరెక్ట్ గా ఉంటాయని, మధ్యలో పేరుకి కిచిడీ చేసేస్తాడని, ఉదాహరణకు తన పేరు తారక్ అయితే.. కారక్… అని పిలుస్తాడని.. చమత్కరించాడు. ఈ విషయం నిజమే అని.. చరణ్ కూడా అంగీకరించాడు. మీకు సంగీతం నేర్పించిన గురువు ఎవరు? అని అడిగితే.. `పేరు మర్చిపోయా.. తారక్ చెప్పాడు కదా. అది నా బలహీనత అని` అని నవ్వుతూనే ఒప్పుకున్నాడు చరణ్.