రాజ్ తరుణ్ ని పొగుడుతూ మిగతా హీరోలకు చురకలేసిన వర్మ

నిన్న రిలీజ్ అయిన కుమారి 21ఎఫ్ అనుకున్నట్టుగానే సిని ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. అయితే దీనిలో మొదటిగా గొప్ప దర్శకుడు అంతకంటే గొప్ప విమర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ సినిమా గురించి పొగిడాడు. వర్మ పొగడం కాస్త ఆశ్చర్యం అనిపించినా ఏదీ ఒక స్పెషాలిటీ లేనిది వర్మ పనులు ఉండవు కాబట్టి రాజ్ తరుణ్ ని పొగుడుతూ స్టార్ హీరోల వారసులకు చురకలు వేశాడు. ఇండైరెక్ట్ గా వర్మ అందరికి షంటింగ్ ఇచ్చాడు అని దానర్ధం.

భారీ బడ్జెట్ తో వచ్చినంత మాత్రాన సినిమాలు హిట్ అవ్వవు.. సింపుల్ గా రాజ్ తరుణ్ లా సినిమాలు చేస్తే చాలు అంటూ సెటైర్ వేశాడు వర్మ. అంతేకాదు స్టార్స్ వారి వారసులు రాజ్ తరుణ్ సినిమాలు చూడాలని కూడా మెసేజ్ చేశాడు. వర్మకు ఏదన్న విషయం నచ్చితే అది ఎక్కడికి లేపుతాడో మనకు తెలిసిందే కదా.. ప్రస్తుతం వర్మ కుమారి 21ఎఫ్ సినిమాని పొగుడుతూ రాజ్ తరుణ్ ని లేపుతున్నాడు.

రాజ్ తరుణ్ మీద స్టార్ హీరోలు చూపు చూడాలని హింట్ ఇచ్చినట్టే ఉంది. ఏమాట కామాట చెప్పాలంటే వర్మ అన్నాడని కాదు కాని.. ఉయ్యాల జంపాలతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ సినిమా సినిమాకు చాలా పరిణితి సాధిస్తున్నాడు. సింపుల్ కథే అయినా నటనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. మరి కెరియర్ ఎలా ఉంటుందో తెలియదు కాని ప్రస్తుతం మాత్రం సినిమా తీస్తే హిట్టే అన్నట్టు ఉంది రాజ్ తరుణ్ పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close