అప్పటి కసి ఇప్పుడు తీర్చుకుంటున్నాడు..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అది ఒక సెన్షేషనే.. అయితే సారుకి ఏదో ఒక మ్యాటర్ మీద కెలకక పోతే నిద్ర పట్టదు. అందుకే మెగాస్టార్ మీద ఆయన సినిమాల మీద పడ్డాడు. చిరు 150వ సినిమా నుండి స్టార్ట్ అయిన వర్మ వీరంగం బ్రూస్ లీ సినిమా చిరు ఎందుకు తీశాడో..అంటూ తన మార్క్ పంచులు వేశాడు. ఇకపోతే అసలు మెగా ఫ్యామిలీకి వర్మకు ఎక్కడ చెడిందబ్బా అని ఆరా తీస్తే.. మెగాస్టార్ ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు వర్మ కూడా క్రేజీ డైరక్టర్ గా చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా స్టార్ట్ అయ్యిందట.. షూటింగ్ కూడా జరుగుతున్న సందర్భంలో వర్మ బిహేవియర్ నచ్చక సినిమా నుండి తప్పించాడట చిరంజీవి. అందుకే అప్పటినుండి మెగాస్టార్ పై కసి పెంచుకున్నాడట వర్మ. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఇది హాట్ న్యూస్ గా స్ప్రెడ్ అవుతుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ ఫ్యాన్స్ కోపానికి బలయ్యాడు. మెగా ఫ్యాన్స్ ఏకంగా వర్మ శవయాత్ర కూడా నిర్వహించి వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని వర్మ ఇలా మాట్లాడుతున్నాడు అనడం ఎంతవరకు సమజసమో తెలియాలి. మొత్తానికి రాజుకున్న ఈ మెగా వర్మల గొడవల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్న కేసులో దర్యాప్తు అధికారిపై మానవ హక్కుల ఉల్లంఘన అభియోగం..!?

అచ్చెన్న కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని..హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏసీబీ వర్గాల్లో కొత్త కలకలానికి కారణం అవుతున్నాయి. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల...

రైతుకు కేసీఆర్ ఫోన్.. విమర్శలకు సమాధానమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు తక్షణం సమాచారం తెలియాలంటూ.. కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్న సమయంలో... ఆయన ఓ రైతుతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సీఎంవో మీడియాకు సమాచారం పంపింది. ఫామ్‌హౌస్‌లో...

ఏపీ సీఎంవోలో వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ ప్రకాష్..!

నేను ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అని ఓ సినిమాలో రజనీకాంత్ అంటాడేమో కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. ఒక్క సారి చెబితే...

జగన్ వరం.. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సౌకర్యాలు సరిపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం ప్రైవేటు చికిత్సకు అనుమతులు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ కింద.. కరోనాకు.. చికిత్స...

HOT NEWS

[X] Close
[X] Close