రామ్ గోపాల్ వర్మ గ్రేట్ ఫిల్మ్ మేకర్. మొదటి సినిమా ‘శివ’ చూసి ముక్కున వేలేసుకున్నారంతా. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పడానికి ఓ మెనగాడొచ్చాడని అందరిచేత శభాస్ అనిపించుకున్నాడు వర్మ. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఓ కొత్త శకం మొదలైయింది. ఇక బాలీవుడ్లో కూడా జెండా పాతాడు వర్మ. సత్య , రంగీలా, సర్కార్.. ఇలా దిమ్మతిరిగిపోయే సినిమాలు చేశాడు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వర్మ నుండి మెరుపులు లేవు. వరల్డ్ సినిమాని మంచినీరులా తాగేసే తెలివితేటలు వుండే వర్మ.. ఇపుడు సినిమాని పూర్తిగా విసర్జించాడని అనిపిస్తుంది ఆయన నుండి వస్తున్న సినిమాలు చూస్తుంటే. అయినా వర్మపై ఆయన అభిమానుల్లో బోల్డంత నమ్మకం. ఎప్పటికైనా అద్భుతం సృష్టిస్తాడని గంపెడాశలు. ఇది వర్మ సినీ జీవితం.
వర్మ కు ఇంకో సైడ్ కూడా వుంది. వర్మను ఫిల్మ్ మేకర్ గా కొందరు అభిమానిస్తే.. ఆయనలోని థింకర్ ని చాలా మంది ఇష్టపడతారు.’రాముయిజం’ అంటూ సెపరేట్ గ్రూపే వుంది ఆయనకు. ఆయన ఆలోచనలు కొంతమందికి నచ్చుతాయి. నగ్న సత్యాలు మాట్లాడతాడు అని కితాబులు ఇస్తుంటారు ఆయన అభిమానులు. అయితే ఈ అభిమానులను కూడా కోల్పోయే స్థితికి వచ్చాడు వర్మ. గత వారం రోజులుగా ఆయన ఫేస్ బుక్, ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య తగ్గిపోయింది. దీనికి కారణం ‘మెగా’ ఎపిసోడ్. మెగా బ్రదర్ నాగబాబు మాటలకు వర్మ కౌంటర్ చేసిన విధానం ఆయన వీర అభిమానులకు కూడా నచ్చలేదు.
జనరల్ గా వర్మను చాలా గొప్పగా ఉహించుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాంటి వర్మ బాలయ్య సినిమాతో చిరంజీవి సినిమాకి ముడిపెడుతూ, చిన్నగా చేసి మాట్లాడుతూ, అలాగే వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన వీర ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. నిజంగా ఈ ఎపిసోడ్ లో ఓ చిన్నపిల్లాడిగా వ్యవహరించాడు వర్మ. అసలు వర్మ నుండి అలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు ఉహించలేదు ఆయన ఫ్యాన్స్. మరి దిగజారిపోయి, ఒక ఇండస్ట్రీ పర్శన్ అనే స్పృహ లేకుండా కేవలం ఒక సినిమాపై బురదజల్లే వ్యాఖ్యలు చేయడం,పర్శనల్ ఎటాకింగ్ కు దిగడం ‘రాముయిజం’ను ఇష్టపడే వారికీ రుచించలేదు. ”సారీ సార్… మీరు మరీ ఇంత అల్పుడిగా ఆలోచిస్తారు, మాట్లాడతారు అని ఉహించలేదు. బాయ్”’ అంటూ చాలా మంది వర్మ అభిమానులు ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అన్ ఫాలో అయిపోయారు. మొత్తంమ్మీద సినిమా పరంగా ఫాలోయింగ్ ను కోల్పోయిన వర్మ.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అన్ పాపులర్ అయ్యే స్థితికి చేరుకుంటున్నాడు. సంక్రాంతి వార్ ముగిసింది. బాలయ్య గెలిచాడా, చిరు గెలిచాడా అనేదెవ్వరూ ఆలోచించడం లేదు. మంచి సినిమాలు చూసి ఈ సంక్రాంతి సంబరాల్ని అభిమానులు రెట్టింపు చేసుకొన్నారు. చిరు కూడా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొన్నాడు. రికార్డుల పరంగా, వసూళ్ల పరంగా లెక్కలు గడితే.. `బాస్ ఈజ్ బ్యాక్` అనే ట్యాగ్ లైన్‌కి న్యాయం జరిగిపోయినట్టే. మరి అదే పనిగా చిరు సినిమాని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పిన వర్మ ఇప్పుడేమంటాడో…?? తన పిచ్చి పిచ్చి మాటలకు, వ్యాఖ్యలకు ఆయన అభిమానులు సైతం పట్టించుకొంటారో… కోరో.. వెయిట్ అండ్ సీ.