ద‌ర్శ‌కుల్ని క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న నితిన్‌

వెంకీ కుడుముల‌
ర‌మేష్ వ‌ర్మ‌
విజ‌య్ కుమార్ కొండా
చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి…

నితిన్ ద‌గ్గ‌రున్న ద‌ర్శ‌కుల లిస్టు ఇది. ఛ‌లో త‌ర‌వాత వెంకీ కుడుముల‌కు నితిన్ ఆఫ‌ర్ ఇచ్చాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో భీష్మ అనే సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. క‌థానాయిక‌ల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ సినిమా సంగ‌తి ఏమ‌య్యిందో తెలీదు. ఈలోగా విజ‌య్ కుమార్ కొండాతో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడ‌ని, గుండె జారిగ‌ల్లంత‌య్యిందేకి ఈ సినిమా సీక్వెల్ లా ఉండొచ్చ‌ని చెప్పుకున్నారు. ఈలోగా ఈరోజు ఉద‌య‌మే.. ర‌మేష్ వ‌ర్మ‌తో సినిమా ఫిక్స‌య్యింద‌ని నిర్మాత త‌ర‌పున అధికారిక ప్ర‌క‌టన వచ్చింది. ఆగ‌స్టు నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని చెప్పారు.

సాయింత్రం నితిన్ మ‌రో సినిమా ప్ర‌క‌టించాడు. ఈసారి చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి వంతు వ‌చ్చింది. భ‌వ్య ఆర్ట్స్ ప‌తాకం పై ఈ సినిమా ఉంటుంద‌ని ధృవీక‌రించాడు. ఈ ప్ర‌క‌ట‌న స్వ‌యంగా నితిన్ నుంచి వ‌చ్చింది కాబ‌ట్టి.. ఈ సినిమా ప‌క్కా అని ఫిక్స‌యిపోవాలి. మ‌రి.. వెంకీ కుడుముల‌, ర‌మేష్ వ‌ర్మ సంగ‌తేంటి? వెంకీ కుడుమ‌ల‌తో చేయాల్సిన భీష్మ ఏమైంది? ఆ సినిమా ఉంటుందా, లేదా? ఏప్రిల్ ణుంచి చందూ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అంటే.. వెంకీ కుడుమ‌ల సినిమా లేన‌ట్టే అనుకోవాలా?

మ‌రోవైపు చందూ సినిమా గురించి ట్విట్ట‌ర్‌లో స్పందించిన నితిన్‌… ర‌మేష్ వ‌ర్మ సినిమా గురించి ప్ర‌స్తావించ‌లేదు. పైగా `నా ప్రాజెక్టు నెంబ‌ర్ వ‌న్ ఇదే` అంటూ హింట్ ఇచ్చాడు. ఉద‌యం ర‌మేష్ వ‌ర్మ సినిమా ఎనౌన్స్ అయ్యింది.

సాయింత్రానికి నితిన్ మ‌రో సినిమా ప్ర‌కటించాడు. మ‌రింత‌కీ ర‌మేష్ వ‌ర్మ సినిమా ఉన్న‌ట్టా? లేన‌ట్టా? ర‌మేష్ వ‌ర్మ సినిమా అనే ప్రెస్ నోట్‌కి కౌంట‌ర్ ఇవ్వ‌డానికే నితిన్ చందూ సినిమాని ఇప్ప‌టికిప్పుడు ప్ర‌క‌టించాడా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నితిన్ తాజా ట్వీట్‌తో వెంకీ కుడుముల‌, ర‌మేష్ వ‌ర్మ‌, విజయ్ కుమార్ కొండాలు క‌న్ ఫ్యూజ్‌లో ప‌డిన‌ట్టే. మ‌రి నితిన్ ప్లాన్ ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close