తెలుగు సినిమా గ్లామర్, గ్రామర్ ని మార్చేసిన సినిమా ‘శివ’. శివ ఈ నెల 14న రీరిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా నాగార్జున, వర్మ ప్రెస్ ముందుకు వచ్చారు. మళ్లీ ‘శివ’ తెరకెక్కించాల్సి వస్తే ఎవరితో తీస్తారు?’ అని అడగ్గా.. ‘శివ’ కేవలం నాగార్జున కోసమేనని, ఆయన్ను తప్ప మరొకరని ఊహించుకోలేనన్నారు’ అన్నారు వర్మ.
చైతు, అఖిల్ ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానంటే అంగీకరిస్తారా అనే ప్రశ్నకు నాగ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వాళ్లకి అంత కరేజ్, గట్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదని నవ్వేశారు. ‘శివ ఓ మ్యాజిక్. శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఈ అకేషన్ లో సినిమా రీరిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. రాము రీరిలీజ్ కోసం ఆరునెలలు వర్క్ చేశారు. దానికి కావాల్సినది ఇచ్చాం. ఇప్పుడు సినిమా చూసినప్పుడు మళ్ళీ కొత్తగా చూసిన ఫీలింగే కలిగింది’ అన్నారు నాగ్.
మొత్తానికి అటు వర్మ, ఇటు నాగ్.. శివ అంటే వన్ అండ్ ఓన్లీ నాగార్జున అని తేల్చేశారు. సీక్వెల్, ప్రీక్వెల్ అలోచనే చేయడం లేదు. నిజమే.. కొన్ని క్లాసిక్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. అందులోనూ శివ లాంటి కల్ట్ క్లాసిక్ ని టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయకపోవచ్చు.


