ర‌ష్మిక‌… నితిన్ సినిమా చేయ‌ట్లేదా?

ర‌ష్మిక ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ కేక్‌. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ల‌క్కీ హీరోయిన్‌గా మారిపోయింది. `చ‌లో`, `గీత గోవిందం`, `దేవ‌దాస్‌` సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ర‌ష్మిక ప్ర‌స్తుతం `డియ‌ర్ కామ్రేడ్` చేస్తోంది. ఈ సినిమా త‌ర్వాత ర‌ష్మిక `భీష్మ‌` సినిమా చేయాల్సింది. `భీష్మ‌`లో నితిన్ హీరో. హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా హారిక హాసిని సంస్థ ఆమె కాల్షీట్‌ను `అల్లు అర్జున్‌` సినిమాకు షిఫ్ట్ చేసింద‌ట‌. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు హారిక హాసిని సంస్థ ఒన్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్స్. సో ఆల్రెడీ త‌మ ద‌గ్గ‌రున్న ర‌ష్మిక కాల్షీట్ల‌ను వాళ్లు అల్లు అర్జున్ సినిమాకు షిప్ట్ చేశార‌ట‌. బ‌న్ని – త్రివిక్ర‌మ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల‌కు ఛాన్స్ ఉంద‌ని టాక్‌. సో వాళ్ల‌ల్లో ర‌ష్మిక ఒక హీరోయిన్ అని అర్థం. మరి ఈ సినిమా త‌ర్వాత ఆమె `భీష్మ‌` చేస్తుందా? లేకుంటే ముందుగానే కాల్షీట్ అడ్జస్ట్ చేసిందా? అస‌లు చేయ‌డం లేదా? అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ అండ్ వాచ్‌… అంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close