చంద్రబాబు: ప్రజాస్వామ్య రక్షకుడా? ఉపేక్షకుడా?

ఎన్డీయేనుండి బయటకు వచ్చాక తను ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికితను చేసే యజ్ఞంలో భాగమే అని, తనని తాను ప్రజాస్వామ్యాన్ని రక్షించే రక్షకుడిగా ప్రగల్భాలు పలికే బాబు గారు.. అదే ప్రజాస్వామ్యంలో పవిత్ర ఆలయాల లాంటి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొని..ప్రజాస్వామ్యానికి చెరగనిమచ్చ తెచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ విషయాన్ని తెలుగు మీడియాలో కూడా చర్చించుకోక పోవడం భాదాకరం.

మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు?

2014 లో టీడిపి గెలుచుకున్నఎమ్మెల్యే సీట్లు 102, వైసీపిగెలుచుకున్నఎమ్మెల్యే సీట్లు 67. 2014 ఎన్నికల ఫలితాలు ప్రకటించాక, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిప్రభుత్వాన్నికూడా నిర్మించకముందేఇద్దరుప్రతిపక్షMP లకు టీడిపి లోకి ఆహ్వానం అందింది అంటే ఎన్నికల స్ఫూర్తి మీద టీడిపికి ఉన్న గౌరవం ఏ పాటిదోఅర్థమవుతుంది.ఆ తరువాత జనవరి 2016 లో నలుగురు ఎమ్మెల్యేలతో మొదలైన ఫిరాయింపుల పర్వానికి.. ఒకటి.. ఒకటి.. తోడయి చివరకు 23 ఎమ్మెల్యేలు గా మారింది. ఇంతమంది పార్టీ ఫిరాయింపులు చేసినా వాళ్లు అనర్హులు ఎందుకు కాలేదు? ఫిరాయింపులనిరోధకచట్టాన్ని ఎలా తప్పించుకున్నారు?

ఫిరాయింపులనిరోధకచట్టం ఏం చెబుతుంది?

ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికయిన వారు.. డబ్బు కోసమో, పదవుల కోసమో వేరే పార్టీల తీర్థాన్ని పుచ్చుకొనే సాంప్రదాయానికి కల్లెం వేస్తూ 1985 లో 52 వ రాజ్యంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో భాగంగా 10 వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఒక పార్టీ టికెట్ మీద శాసన సభకి ఎన్నికయిన అభ్యర్థిఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేసినా లేదా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శాసనసభకి అనర్హుడు అవుతాడు.ఈ చట్టంలో ఉన్న ఒకే ఒక్క మినహాయింపు ఒకేసారి 2/3 వ వంతు ఒకే పార్టీకి చెందిన శాసన సభ్యులు పార్టీ ఫిరాయించడం. కానీ ఇక్కడ వైసీపి నుండి అంత మంది టీడిపి లోకి వెళ్ళిపోలేదు,వెళ్ళిన వాళ్లు కూడా ఒకేసారి వెళ్లలేదు. ఈ చట్టం ప్రకారం, న్యాయంగా అయితే ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలు అనర్హులే కానీ వాళ్ళందరూ ఇంకా శాసన సభలోనే ఉన్నారు, వారిలో నలుగురుకిమంత్రి పదవి కూడా ఇచ్చారు బాబు గారు. ఇదెలా సాధ్యం?

40 సంవత్సరాల బాబు గారి అనుభవం చేసిన మాయ

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ నిఫిరాయించిన ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించే నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. భారతదేశ వ్యవస్థలో శాసన సభకి ఎంపిక అయ్యే స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే అయ్యుంటాడు. అయితే స్పీకర్ నిర్ణీత సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించాలి అనే నియమం ఈ చట్టంలో లేదు. ఇక్కడే బాబు గారి నలభైసంవత్సరాల అనుభవం ఉపయోగపడింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించే నిర్ణయాన్ని తన పార్టీ సభ్యుడు మరియు స్పీకర్ అయినా కోడెల శివ ప్రసాద్ తో సంవత్సరాలుగా వాయిదా వేయిస్తూనే ఉన్నాడు. జగన్బృందంస్పీకర్ ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు, ఇదేవిషయం మీద రాష్ట్రపతికిలేఖ రాశారు, అసెంబ్లీలో ధర్నా చేశారు ఎన్ని చేసినా స్పీకర్ గారు మాత్రం ఈ విషయం మీద నిర్ణయం తీసుకోరు. ఇక్కడ కోడెల గారు స్పీకర్ అయినా అతను కూడా ఒక టీడిపి ఎమ్మెల్యే, బాబు గారి ఆదేశాల మేరకే పనిచేస్తాడు అనే విషయం గుర్తుంచుకోవాలి.

న్యాయ వ్యవస్థని ఎలా అధిగమించారు?

ఇదే విషయంలో ఎందుకు రాజీనామా చేయకుండా పార్టీలు మారారనిఎమ్మేల్యేలకి, ఎందుకు పార్టీలు మారిన వారిని అనర్హులుగా ప్రకటించలేదో వివరణ ఇవ్వండి అని స్పీకర్ కి కూడా కోర్టు నుండి నోటీసులు అందాయి. కోర్టు మమ్మల్ని అడగడం ఏంటి, మేమెందుకు సమాధానం చెప్పాలి అన్న చందాన కోర్టుకి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.ఇవ్వకపోతేఏం జరుగుతుంది?ఇంకో నోటీసు… ఆ తరువాత మరో నోటీసు.. చివరికి అరెస్ట్ వారెంట్ వచ్చేలోపు సభా కాలం ముగుస్తుంది, మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇందాక అనుకున్నట్టు వ్యవస్థలనిఎలాదాటవేయాలో బాబు గారికి బాగా తెలుసు, బాబ్లీ విషయంలో కూడా ఇలాంటి ధోరణినే అనుసరించారు అని గుర్తుచేసుకోవాలి.

ప్రతిపక్షం లేని శాసన సభ

ఇలాఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో అసెంబ్లీని బాయ్ కాట్ చేయడానికి నిర్ణయించుకుంది ప్రతిపక్షం. అక్టోబర్ 2017 నుండి మొదలు ఇప్పుడు జరిగే బడ్జెట్ సెషన్ వరకు మొత్తం నాలుగు సెషన్ లు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం హాజరు కాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని సభ అంటే సమాధానాలు రాయాల్సిన అవసరం లేని పరీక్ష లాంటిది అధికార పక్షానికి. గతఒకటిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో కీలక మార్పులు, ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది.. వీటన్నటిమీద ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేక, సమాధానాలు ఇచ్చే అవసరం లేక రాష్ట్ర పాలన అధికారపక్షానికి ఇష్టారాజ్యంగా మారిపోయింది. అసలు ఏ మాత్రం చర్చ కూడాజరగకుండానే ఎన్నో కీలక బిల్లులు చట్టాలుగా మారిపోయాయి.రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన ఈ పరిణామంలో చివరకు నష్టపోయింది ప్రజలే.

ముగింపు

స్వప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నిఉల్లఘించిన బాబు గారు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే తను బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నాను అంటే ఎంత వరకు నమ్మగలం? కేంద్రం రాష్ట్రాలని గుమాస్తాలుగా చూస్తుంది అని ఆరోపించే బాబు గారు… అసలు పంచాయితి ఎన్నికలు కూడా జరపకుండా జన్మభూమి కమీటిల ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థని నడిపిస్తుంటే ఫెడరల్ స్పూర్తినికాపాడగలరు అని ఎలా నమ్మాలి?

– The Perpetual Spectator

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close