ఎన్టీఆర్‌తో ర‌ష్మిక‌?

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబో ఓకే అయిపోయింది. సెప్టెంబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ కూడా మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ‘దేవ‌ర‌’ అవ్వ‌గానే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టుకు కాల్షీట్లు ఇచ్చేశాడు. ఈ చిత్రానికి ‘డ్రాగ‌న్‌’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. మ‌రోవైపు క‌థానాయిక ఎంపిక‌పై కూడా క‌స‌ర‌త్తు మొద‌లైంది. ఆ ఛాన్స్ రష్మిక‌కు ద‌క్కే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

మ‌హేష్‌, బ‌న్నీ.. ఇలా ఈత‌రం అగ్ర హీరోలంద‌రితోనూ జోడీ క‌ట్టింది రష్మిక‌. ఎన్టీఆర్‌తో మాత్రం న‌టించే అవ‌కాశం రాలేదు. ఎన్టీఆర్ – ర‌ష్మిక కాంబో… ఫ్రెష్షుగా క‌నిపిస్తుంది. అందుకే ర‌ష్మిక‌వైపు చిత్ర‌బృందం మొగ్గు చూపిస్తోంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ‘రెయిన్ బో’, ‘గాళ్ ఫ్రెండ్‌’ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్ తో ఓ సినిమా ఒప్పుకొంది. దానికి తోడు విజ‌య్ – రాహుల్ సంకృత్య‌న్ కాంబోలో సినిమాలోనూ త‌నే నాయిక‌. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమానీ ప‌ట్టేసుకొంది. ర‌ష్మిక న‌టించిన ‘పుష్ష 2’ ఈ ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి చెక్ పెట్టేలా ఆరెస్సెస్ వ్యూహం !

ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే...

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ ?

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో...

ఐదేళ్లూ ప్రజల సొమ్ముతో జగన్ జల్సా

ముఖ్యమంత్రి ప్రజాసొమ్ముకు కస్టోడియన్. ప్రజలు శ్రమ చేసి రూపాయి రూపాయి పన్నులుగా కడితే వచ్చే సొమ్మును అంతే జాగ్రత్తగా ప్రజోపయోగం కూడా వాడాలి. కానీ జగన్ ఐదేళ్ల పాటు ఏం చేశారు. ...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close