అనుష్క కోసం త్యాగం చేస్తున్న రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ ఈ నెల 27న బెంగాల్ టైగర్ తో సినిమాతో అలరిస్తాడని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే అదే రోజు రిలీజ్ అవుతున్న సైజ్ జీరో సినిమా కోసం తన సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాడట రవితేజ. సంపత్ నంది డైరక్షన్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న బెంగాల్ టైగర్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు రవితేజ. అందుకే సినిమాకు ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఉండేందుకు చూస్తున్నాడు. అసలైతే సినిమా దీపావళికే రావాల్సి ఉన్నా అఖిల్ కోసం నాగ్ కోరిక మేరకు సినిమా వాయిదా వేశాడు. ఇప్పుడు సైజ్ జీరో కోసం మళ్లీ రెండోసారి వాయిదా వేసుకుంటున్నాడు.

సైజ్ జీరో విషయానికొస్తే అనుష్క లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేశాడు. రుద్రమదేవి టైంలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆ సినిమా కారణంగా సైజ్ జీరో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరకు ఈ నెల 27న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైన సైజ్ జీరోకి రవితేజ పోటీగా నిలుస్తాడనుకున్నారు. కాని రెండు సినిమాల దర్శక నిర్మాతల అండస్టాడింగ్ తో రవితేజ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.

తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్న బెంగాల్ టైగర్ సినిమాను ఫుల్ లెంథ్ మాస్ ఎంటర్టైనర్ గా రవితేజ అభిమానులకు మంచి విందు భోజనంలా తెరకెక్కించాడు సంపత్ నంది. సినిమా ఈ నెల 27 నుండి డిశెంబర్ 10కి పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి పరిశ్రమ మేలుకోసం పరస్పర ఒప్పందంతో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణం పొంది సూపర్ హిట్స్ గా నిలవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రామ్ చ‌ర‌ణ్ కోసం ప్లాన్ బి

ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఇది వ‌ర‌కే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొద‌లెడ‌తారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌పై యాక్ష‌న్ ఘ‌ట్టంతో ఈ షెడ్యూల్‌కి...

తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.....

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

తెలంగాణతో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. స్మూత్‌గా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాల్సిన ఏపీ ప్రభుత్వం... అనవసర వివాదంతో.. కేఆర్ఎంబీ దృష్టిలో పడేలా చేసుకుంది. ఫలితంగా.. ఇప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉంటే తప్ప.....

“గాసిప్‌ సైట్‌”పై లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ ఫిర్యాదు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈగ వాలినా సహించలేకపోతున్న గాసిప్‌ సైట్‌కు.. ఆ పార్టీ ఎంపీ నుంచే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా కథనాలు రాస్తున్నారంటూ.. గాసిప్ సైట్‌పై.. వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close