రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ సినిమాకి ఒక్క రూపాయి పారితోషకం తీసుకోకుండానే పనిచేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అంగీకరించారు. ఇప్పటివరకు రవితేజ గారికి రూపాయి రెమ్యూనిరేషన్ ఇవ్వలేదని చెప్పారు.
లాభాల్లోనే వాటా తీసుకోవాలనే ఒప్పందంతో ఈ సినిమా చేశారు రవితేజ. నిజానికి రవితేజ కి రెమ్యూనిరేషన్ ఉంటే చాలు కథ గురించి పెద్దగా పట్టించుకోరు అనే టాక్ ఉంది. కానీ అది నిజం కాదని ఈ సినిమాతో రుజువు అయింది.
అంతేకాదు సంక్రాంతికి తీసుకురావాలని ఉద్దేశంతోనే ఈ సినిమా చేశారు. ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సంక్రాంతి ఆడియన్స్ కి నచ్చే అంశాలు. అందుకే సినిమా సైన్ చేసినప్పుడే సంక్రాంతి వస్తేనే చేస్తానని ఒప్పందం చేసుకున్నా రవితేజ. దాని ప్రకారమే ఇంత పోటీలో కూడా సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుంది.
రవితేజ ఇటీవల చాలా మాస్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అవేవీ కూడా కలసిరావడం లేదు. అసలు తనకు సంబంధం లేని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయమని చెప్పడంతో డైరెక్టర్ కిషోర్ తిరుమల తన సెన్సిబిలిటీ తగ్గట్టుగా ఒక కథని, ఒక క్యారెక్టర్ని రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ నచ్చి రవితేజ ఈ సినిమా చేశారు. ఇది మొత్తం కిషోర్ తిరుమల టచ్ ఉండే సినిమా. టీజర్ సాంగ్స్ లో చూస్తుంటే రవితేజ ఫ్రెష్ లుక్ వర్క్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
