ర‌వితేజ టైటిల్‌… ‘కిలాడీ?

ర‌వితేజ – ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. ఈ చిత్రానికి `కిలాడీ` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం `క్రాక్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌. మ‌రో 30 శాతం షూటింగ్ బాకీ ఉంది. అది పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది. ర‌వితేజ – ర‌మేష్ వ‌ర్మ కాంబోలో ఇది రెండో సినిమా. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `వీర‌` వ‌చ్చింది. ఇటీవ‌ల రాక్ష‌సుడు సినిమాతో ఓ హిట్టు అందుకున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. అందుకే ర‌వితేజ నుంచి మ‌రోసారి పిలుపు అందుకోగ‌లిగాడు. ఇది ప‌క్కా క‌మర్షియ‌ల్ సినిమా. ర‌వితేజ పాత్ర ఎప్ప‌టిలా హుషారుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే నాయిక‌ని ఎంపిక చేసి టైటిల్‌తో పాటు, హీరోయిన్ వివ‌రాల‌నూ అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close