బెంగ‌ళూరు క‌థ ముగిసె!

ఈ ఐపీఎల్ లో బెంగ‌ళూరు క‌థ స‌మాప్త‌మైంది. మ‌రో సీజ‌న్‌ని రిక్త హ‌స్తాల‌తోనే ముగించింది. బుధ‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. రెండో ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్థాన్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ లో కొల‌కొత్తాని ఢీ కొట్ట‌నుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ర‌జిత్ ప‌టేదార్ (34), కోహ్లీ (33), మ‌హిపాల్ (32) ఓ మోస్త‌రుగా రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ 19 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ (45), ప‌రాగ్ (36), హిట్మ‌య‌ర్ (26) బ్యాట్ ఝ‌లిపించారు. సిరాజ్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టి చివ‌ర్లో కాస్త ఆశ‌లు చిగురింప‌జేశాడు. అయితే.. పావెల్ (8 బంతుల్లో 16) బెంగ‌ళూరు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు.

ప్ర‌తీసారీ `ఈసారి క‌ప్ మ‌న‌దే` అంటూ ఊరించ‌డం, చివ‌ర్లో చేతులు ఎత్తేయ‌డం బెంగ‌ళూరుకు మామూలే. అయితే ఈ సీజ‌న్‌లో తొలుత ఘోరంగా త‌డ‌బ‌డ్డ బెంగ‌ళూరు, చివ‌ర్లో విజృంభించింది. వ‌రుస‌గా ఆరు గెలుపుల‌తో ప్లే ఆఫ్‌లో అనూహ్యంగా చోటు ద‌క్కించుకొంది. ప్లే ఆఫ్‌కి చేర‌డ‌మే ఈ యేడాది బెంగ‌ళూరు సాధించిన అతి పెద్ద ఘ‌న‌త‌గా మారింది. కోహ్లీ అభిమానులు దాంతో సంతృప్తి ప‌డాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close