టీఆర్ఎస్ బెదిరింపుల కారణంగానే వైకాపాలోకి ఆలీ?

నటుడు ఆలీ వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఎప్పటినుండో ఆసక్తిగా ఉండి కూడా, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ ఏమీ లేకుండానే, వైఎస్ఆర్ సీపీ లో ఆలీ చేరడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ని తన ప్రాణ స్నేహితుడు గా చెప్పుకునే ఆలీ జనసేన లో చేరుతారని చాలా మంది అనుకున్నారు. ఆలీ కూడా వైఎస్ఆర్ సీపీ లో చేరడానికి కొద్దిరోజుల ముందే జనసేన పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు, ఇది మన పార్టీ అంటూ జనసేన కార్యకర్తలతో అన్నారు. దానికి కొద్దిరోజుల ముందే చంద్రబాబు నాయుడు గారి చే సన్మానం పొందాడు. చంద్రబాబుతో పలు సమావేశాలు కూడా చేశాడు. ఏ రకంగా చూసినా ఇటు జనసేన లో కానీ, టీడీపీలో కానీ చేరే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అనుకున్న ఆలీ చివరాఖరికి వైఎస్ఆర్ సీపీ లో చేరటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా టీవీలో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఏ పార్టీ అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ తో పాటు అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తుందో అలాంటి పార్టీలోకి చేరతానని చెప్పిన ఆలీ, కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా లేకుండా వైఎస్ఆర్సీపీలో ఎందుకని చేరాడు అన్న విషయంపై చాలా మందికి స్పష్టత రాలేదు.

ఇప్పుడిప్పుడే ఒక్కొక్క విషయంపై అస్పష్టత తొలగిపోతోంది. జనసేనలో చేరాలనుకున్న చాలా మంది నాయకులను జగన్.. కేసీఆర్ ద్వారా బెదిరించాడని, ఇప్పటికే జనసేనలో చేరిన నాయకులను కూడా టీఆర్ఎస్ బెదిరిస్తోందని వార్తలు వస్తున్నాయి. మొన్నా మధ్య రాజమండ్రి జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణని టీఆర్ఎస్ నేతలు బెదిరించారని వార్తలు వచ్చాయి. ఆయన పోటి నుండి విరమించుకో బోతున్నాడని వార్తలు వస్తే ఆయన స్వయంగా ఖండించాల్సి వచ్చింది. అలాగే 1000 కోట్ల సెజ్ హైదరాబాదులో కలిగి ఉన్న గేదెల శీను ని టీఆర్ఎస్ బెదిరించడం వల్లే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యాక కూడా ఆయన జనసేన పార్టీని వదిలి వెళ్లి వైఎస్సార్ సీపీ లో ఏ టికెట్టు లేకపోయినా కూడా జాయిన్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి. అయితే టీఆర్ఎస్ బెదిరించి ఆపుతున్న నేతల చిట్టా పెద్దగానే ఉంది అని తెలుస్తోంది. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న నాయకులు ఎవరూ కూడా జనసేన వైపు చూడకుండా వైయస్ జగన్ కేసీఆర్ ద్వారా నరుక్కొస్తున్నట్టుగా అర్థమవుతోంది.

చాంతాడులా పెరుగుతున్న ఈ లిస్టులో ఇప్పుడు తాజాగా నటుడు అలీ కూడా చేరారు. బాల నటుడిగా ఉన్నప్పటి నుండి సంపాదిస్తున్న ఆలీ బాగానే ఆస్తులు కూడబెట్టుకున్నాడని, హైదరాబాదులో కూడా బాగానే ఆస్తులు కలిగి ఉన్నాడని, అయితే టీఆర్ఎస్ నేతలు ఆస్తుల విషయంలో బెదిరించడం వల్లే ఇతర పార్టీలో చేరే ఉద్దేశాన్ని మానుకొని, ఏ టికెట్ ఇవ్వకపోయినా వైఎస్సార్సీపీలో చేరాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. నటి దివ్య వాణి ఈ విషయంలో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతల బెదిరింపుల కారణంగానే ఆలీ జనసేనలో చేరకుండా వైఎస్సార్సీపీలో చేరాల్సి వచ్చింది అన్న ఆవిడ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి.

మొత్తానికి కేసీఆర్ ని అడ్డుపెట్టుకొని జగన్ చేస్తున్న రాజకీయం కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా వీరిద్దరినీ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా విమర్శిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎన్నికల్లో ఫలితాలిస్తాయా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close