టూరు ర‌ద్దుకీ జీఎస్టీ పోరుకీ సంబంధం ఉందా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వెళ్లాల‌ని అనుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. ప్ర‌యాణానికి అనుగుణంగానే పోచంపాడు బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అనుకున్న స‌మ‌యం కంటే కాస్త ముందుగానే ఆయ‌న ప్ర‌సంగం మొద‌లుపెట్టేశారు. సాయంత్రానికి హుటాహుటిన హైద‌రాబాద్ చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా ఢిల్లీ ప్ర‌యాణం ర‌ద్దు చేసుకున్నారు! అయితే, ఉన్న‌ట్టుండి ఈ టూరు ఎందుకు ర‌ద్ద‌యిందీ అనేదే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయం అవుతోంది. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్తానని ఆయ‌న ముందే చెప్పారు. కానీ, హాజ‌రు కాలేదు! ఢిల్లీలో అందుబాటులో ఉన్న తెరాస ఎంపీలు ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లాల‌ని సూచించారు. దీంతో ముఖ్య‌మంత్రి ఢిల్లీ వెళ్ల‌క‌పోవ‌డానికీ… జీఎస్టీపై కేంద్రంతో తెరాస పోరాటానికీ ఏదైనా సంబంధం ఉందా అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో వాడీవేడిగా జ‌రుగుతోంది.

వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) విష‌యంలో కొన్ని మిన‌హాయింపుల‌ను కేసీఆర్ కోరుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జల ప్ర‌యోజ‌నాల కోసం చేప‌డుతున్న ప్రాజెక్టుల‌పై ప‌న్ను త‌గ్గించాలంటూ ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. జీఎస్టీ వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌డుతున్న భారాన్నంతా శాఖ‌ల వారీగా లెక్క‌గ‌ట్టి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఒక లేఖ రాయాల‌ని అనుకున్నారు. ప‌న్ను భారాన్ని కేంద్రానికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేద్దామ‌నీ, లేఖ రాసిన త‌రువాత ప్ర‌ధాని నుంచి వ‌చ్చే స్పంద‌న చూసుకుని, ఆ త‌రువాత న్యాయ పోరాటం గురించి ఆలోచిద్దామ‌ని కూడా ఈ మ‌ధ్యే చెప్పారు. అయితే, ఇంత‌వ‌ర‌కూ ఆ లేఖ రాసే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేదు! ఈ నేప‌థ్యంలో ఢిల్లీకి వెళ్తే ప్ర‌ధానితోపాటు, ఆర్థిక‌మంత్రిని కూడా క‌లిసి ప‌న్ను భారంపై చ‌ర్చిస్తార‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా టూరే ర‌ద్దు చేసుకున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహం ఏదైనా ఉందా అనేది చ‌ర్చ‌నీయం అవుతోంది.

ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెన‌క రెండు ర‌కాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో పోరాటానికి సిద్ధం అని కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఢిల్లీ పెద్ద‌లు ఆగ్ర‌హించి ఉంటారా అనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి! భాజ‌పా స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొచ్చిన జీఎస్టీ ప‌న్నుపై వీలైతే సూచ‌న‌లు చేయాలిగానీ, న్యాయ పోరాటం అంటే భాజ‌పా స‌హించే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా! ఇక‌, రెండో అభిప్రాయం ఏంటంటే.. ఇంకా లేఖ కూడా రాయ‌లేదు కాబ‌ట్టి, ఇలాంటి ప‌రిస్థితిలో ఢిల్లీకి వెళ్ల‌కుండా ఉంటేనే వ్యూహాత్మ‌కంగా ఉంటుంద‌ని ఆయ‌న భావించి ఉంటారా అనే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే, ఢిల్లీ టూరు ర‌ద్దుకు గ‌ల కార‌ణాల‌ను ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కూడా ఇంత‌వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close