“రాజ్యాంగ విచ్ఛిన్నం”పై విచారణపై సుప్రీం స్టే..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్చిన్నం అంశంపై విచారణ జరిపేందుకు హైకోర్టుకు అధికారం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోలేదు కదా.. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి ఆ ఆదేశాలను ఎందుకు జారీ చేశారో అర్థం కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ పిటిషన్‌ను వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నారని ప్రశ్నించి… ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించింది. కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై.. విచారణకు అనుమతించాలని సిద్దార్థ లూథ్రా కోరారు. దీంతో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. ఏపీలో పలువురు వ్యక్తుల్ని పోలీసులు అపహరించుకుపోతున్నారన్న అంశంపై పలు హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖల్యయాయి.

వీటిపై విచారణ జరిపిన జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మానసం.. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలిస్తే.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఏపీ సర్కార్ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనుకూల ఫలితం పొందింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close