కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులతో రేవంత్ దూకుడు..!

మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్జీటీ వేసిన కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్‌హౌస్ పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు జారీ చేసి..విచారణ జరిపించాలని ఆదేశించింది. దీనిపై రేవంత్ రెడ్డి.. మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చారు. జన్వాడ ఫామ్‌హౌస్‌పై మరిన్ని సంచలనాత్మకఆరోపణలు చేశారు. 111 జీవోను ఉల్లంఘించి.. 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని.. ఆ భవనం నిర్మాణానికి.. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని రేవంత్ ఆరోపిస్తున్నారు.

కాలువను పూడ్చి.. భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని .. నిష్పక్షపాత విచారణ జరగాలంటే.. కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నట్లుగా గతంలో టీఆర్ఎస్ నేతలు వాదించారు. కానీ ఇప్పుడు ఆ ఫామ్‌హౌస్ మొత్తం కేటీఆర్‌దేనని..రేవంత్ వాదిస్తున్నారు. జన్వాడలో 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని..అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని రేవంత్‌ సవాల్ చేస్తున్నారు. అర్బణా వెంచర్స్‌ అనే సంస్థకు కూడా అక్కడ భూమి ఉందని.. అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఉందని గుర్తుచేశారు. ఒక వేళ లీజుకు తీసుకుంటే.. ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారో, దాని యజమాని ఎవరో బయట పెట్టాలని సవాల్ చేశారు.

జన్వాడ ఫామ్‌హౌస్ మొత్తం కేటీఆర్ సంబంధీకులదేనని..తాను నిరూపిస్తానని.. లేదంటే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ సవాల్ చేస్తున్నారు. కేటీఆర్‌కు ఎన్టీజీ నోటీసులపై…రేవంత్ పోరాటానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా మద్దతిచ్చారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేబినెట్ నుంచి కేటీఆర్‌ తప్పుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌ అవినీతిపై పోరాడిన రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ‌మ్మ‌య్య… చెన్నై గెలిచింది!

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. వ‌రస ప‌రాజ‌యాల‌కు చెన్నై బ్రేక్ వేస్తూ.. ఓ చ‌క్క‌టి విజ‌యాన్ని అంకుంది. అందులోనూ వ‌రుస విజ‌యాల‌తో ఊపులో ఉన్న‌... బెంగ‌ళూరు జోరుని అడ్డుకుంది. ఫ‌లితం.. చెన్నై...

ప‌వ‌న్ వ‌స్తే… లెక్క‌ల‌న్నీ మారాల్సిందే

ఎట్ట‌కేల‌కు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దాంతో ఈ రీమేక్ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. బాల‌కృష్ణ - ర‌వితేజ‌, రానా - ర‌వితేజ‌... ఇలా చాలా...

నిమ్మగడ్డ వర్సెస్ ప్రవీణ్..! చివరికి సారీ..!

ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, సీఎం దగ్గర ఎంతో పలుకుబడి ఉన్న అధికారిగా పేరున్న ప్రవీణ్ ప్రకాష్.. నిమ్మగడ్డ విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించి.. చివరికి క్షమాపణలు చెప్పిన వైనం అధికారవర్గాల్లో కలకలం...
video

అఫీషియ‌ల్‌: `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` లో ప‌వ‌న్

https://www.youtube.com/watch?v=80G4PhM-t90&feature=youtu.be మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తాడా? లేదా? అనే సందేహానికి తెర‌ప‌డింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్ చేస్తున్నాడ‌న్న‌ది ఖ‌రారైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close