రాజకీయాల్లో కేవలం ప్రజలకు ఎంత మేలు చేశామన్న దానికంటే.. టైమ్‌ను బట్టి ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ సెట్ చేశామన్నదే సక్సెస్‌ను డిసైడ్ చేస్తుంది. ఈ ఆర్ట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పక్కాగా వంటబట్టించుకున్నారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సర్కిల్ దగ్గర నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి రేవంత్ రెడ్డి చేసిన రాజకీయం ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ద్వేష రాజకీయాలు, పాత పగలను పక్కనబెట్టి.. అందరినీ కలుపుకుపోయే సరికొత్త రాజకీయ శైలిని ఆయన తెరపైకి తెచ్చారు.
బలమైన ఓటు బ్యాంకు మద్దతు ఆయనకే
తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఇప్పటికీ ఒక బలమైన, చెక్కుచెదరని అభిమానగణం ఉందనే పచ్చి నిజం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ప్రస్తుతం ఆ గణం అంతా రాష్ట్రంలో సరైన పొలిటికల్ డైరెక్షన్ లేక సైలెంట్‌గా ఉన్నారు. అయితే, వారంతా రేవంత్ రెడ్డిని ఒక కాంగ్రెస్ లీడర్‌గా కంటే.. తమ పాత తమ్ముడు గానే, తమ ఓన్ లీడర్‌గానే ఓన్ చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ లాంటి కీలక ఎన్నికల్లోనూ ఈ సైలెంట్ ఓటు బ్యాంక్ రేవంత్‌కు సాలిడ్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీని, ఆ మద్దతును మరింత స్ట్రాంగ్‌గా మార్చుకుని, అది కాంగ్రెస్ ఖాతా కంటే తన వ్యక్తిగత ఓటు బ్యాంక్ గా లాక్ చేసుకోవడానికి రేవంత్ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు.
కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గడుసుతనమే
నిజానికి కాంగ్రెస్ హిస్టరీ చూస్తే.. ఎన్టీఆర్ ఆ పార్టీకి అప్పట్లో బద్దశత్రువు . కానీ, రేవంత్ రెడ్డి ఆ హిస్టరీని నేటి జనరేషన్‌కు చాలా స్మార్ట్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాటి రాజకీయ పరిస్థితులు వేరు.. నేటి సమీకరణాలు వేరు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా కన్విన్స్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ బ్రాండ్ అయిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతూనే.. మరోవైపు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ గ్రేట్నెస్ను కొనియాడటం కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. ఎవరినీ తక్కువ చేయకుండా, ఇద్దరి లెగసీని గౌరవిస్తూ ఆయన ప్లే చేస్తున్న ఈ బ్యాలెన్సింగ్ పొలిటికల్ గేమ్ అద్భుతమనే చెప్పాలి.
రాజకీయ వ్యూహాల్లో రేవంత్ నెంబర్ వన్
పరిపాలనా పరంగా కొన్ని లోపాలు లేదా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్యూర్ పాలిటిక్స్, వ్యూహాల విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టే అంత పొలిటికల్ స్మార్ట్‌నెస్ ఉన్న లీడర్ ప్రెజెంట్‌గా ఎవరూ లేరనేది అక్షర సత్యం. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడమే కాకుండా, శత్రు పక్షంలో ఉన్న సానుభూతిని కూడా తన వైపునకు తిప్పుకోవడంలో ఆయన మాస్టర్ మైండ్ అని నిరూపించుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు మైండ్ గేమ్ ఆడేలోపే.. రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణల ద్వారా ఒక పెద్ద సెంటిమెంట్ వేవ్‌ను క్రియేట్ చేశారు.
గ్రేటర్ ఎన్నికలకు పక్కా స్కెచ్
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ తెలంగాణ రాజకీయాల్లో లాంగ్ రన్ లో చాలా కీలకమైన మార్పులకు కారణం కాబోతోంది. పార్టీ జెండాల కంటే నాయకుడి ఇమేజ్ ముఖ్యమనే ట్రెండ్‌ను ఆయన సెట్ చేస్తున్నారు. మైత్రీవనం సాక్షిగా రేవంత్ వేసిన ఈ ప్లాన్ రాబోయే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆయన పట్టుకు ఒక పెద్ద పొలిటికల్ అడ్వాంటేజ్‌గా మారనుందని భావిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంతే!
