రేవంత్, పవన్ కల్యాణ్ కలిస్తే యూరేనియం బ్లాస్టే..!

తెలుగు రాష్ట్రాల రాజకీయంలో… శనివారం ఓ కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదే తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేయడం. యూరేనియం పై పోరాటంలో… కలసి నడవాలని నిర్ణయించుకోవడం. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా… అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. తమ పోరాటం మరింత బలంగా ఉండాలంటే… రేవంత్ రెడ్డి కూడా ఉండాలని పవన్ కోరుకున్నారు. వెంటనే.. ఆయనకు ఫోన్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి రేవంత్‌ను ఆహ్వానించారు. వెంటనే… రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యేందుకు అంగీకరించారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికే యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పోరాటం ప్రారంభించారు. నల్లమల గ్రామాల్లో పర్యటించి.. ప్రాణాలు ఒడ్డి అయినా యూరేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ప్రకటించి వచ్చారు. అదే సమయంలో.. తెలంగాణ సర్కార్ పై యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున.. పోరాటాన్ని లీడ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే యూరేనియం … నిల్వల పరిశీలనకు… గ్రామాలకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్… సేవ్ నల్లమల ఉద్యమానికి.. మద్దతు పలికి సెలబ్రిటీల్లో ఓ రకమైన స్పందన రావడానికి కారణమయ్యారు. పవన్ కల్యాణ్ ఆదర్శంగా చాలా మంది.. సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీంతో ఓ రకమైన కదలిక వచ్చింది.

రేవంత్ రెడ్డి అటు మాస్‌లోనూ.. ఇటు ప్రసంగాల పరంగా… విపరీతంగా క్రేజ్ ఉన్న నేత. పవన్ కల్యాణ్ కు కూడా… అభిమానుల వెల్లువ ఉంది. వీరిద్దరూ.. జంటగా లీడ్ తీసుకుని.. రాజకీయాలకు అతీతంగా సేవ్ నల్లమల ఉద్యమాన్ని లీడ్ చేస్తే… తెలుగు రాష్ట్రాలు మొత్తం ఊగిపోవడం ఖాయం. యువత మొత్తం వారి వెంట నడుస్తుంది. భావితరాల కోసం.. నల్లమలని కాపాడుకోవడానికి… మహోద్యమం నడుస్తుంది. అందకే.. ఇద్దరూ కలిస్తే.. పొలిటికల్‌గా యూరేనియం బ్లాస్టేననే అంచనా… ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

సుధాకర్ కేసులో “గుర్తు తెలియని అధికారుల”పై సీబీఐ కేసులు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ సుధాకర్ వద్దకు వెళ్లి వాంగ్మూలం...

HOT NEWS

[X] Close
[X] Close