రాయలసీమలో రెండో రాజధాని..! బీజేపీ డిక్లరేషన్ ఇదే..!

భారతీయ జనతా పార్టీ రాయలసీమ కోసం…. ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కడపలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సమావేశమై… ఈ మేరకు.. రాయలసీమకు సంబంధించిన కీలమైన డిమాండ్లతో ఓ ప్రకటనను… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రక్రటించారు. అందులో అనేక కీలకమైన అంశాలున్నాయి. రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలనేది.. బీజేపీ డిమాండ్లలో మొదటిది. తర్వాత రాయలసీమలో హైకోర్టు , రాయలసీమ ప్రాజెక్టులకు 210 టీఎంసీల నికర జలాలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు , పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను లక్ష క్యూసెక్కులకు పెంచడం, గుండ్రేవుల, ఆర్డీఎస్‌ సమాంతర కాలువ, వేదావతిపై జలాశయం నిర్మించడం, జోలదరాశి, రాజోలి జలాశయాలను తక్షణం పూర్తి చేయడం మిగతా డిమాండ్లు. అలాగే.. రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి 20 వేల కోట్లు కేటాయించాలనేది.. మరో కీలకమైన ఆర్థిక డిమాండ్. రాయలసీమను 8 జిల్లాలుగా పునర్విభజన చేయాలని కూడా కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు.

కడపజిల్లా ప్రొద్దుటూరులో నిన్న బీజేపీ ముఖ్యనేతలు ఇండోర్ మీటింగ్ జరిపారు. భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై.. సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ చేసిన ప్రత్యేకమైన సూచనల మేరకే.. ఈ సమావేశం జరిగిందని… ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఈ సమావేశం ఎజెండా కూడా సీక్రెట్ గానే ఉంది. కానీ… రాయలసీమ బీజేపీలో జరగబోయే.. కొన్ని కీలకమైన మార్పులపై.. ఈ సమావేశంలో.. పార్టీ నేతలకు.. హైకమాండ్ నుంచి సందేశం అందినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాతే… కన్నా లక్ష్మినారాయణ డిమాండ్లను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత బీజేపీ ప్రధానంగా రాయలసీమపై దృష్టి పెట్టింది. భయంతోనే.. మరో కారణంతోనే.. బీజేపీలో చేరడానికి వచ్చే నేతల వల్ల …ప్రయోజనం ఎంత ఉంటుందో.. ఊహించలేనంత …వ్యూహకర్తలు బీజేపీలో లేరు. అందుకే.. వారి చేరికలతో పాటు.. ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందుకే రాయలసీమపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెబుతున్నారు. రాయలసీమకు సంబంధించిన కీలకమైన సమస్యలపై తాము పోరాటం చేసి…వాటి కేంద్రం ద్వారా పరిష్కారాలు చూపించి… ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close