” అగ్రెసివ్ గాంధీ ” కేసీఆర్..! వర్మ కొత్త ప్రాజెక్ట్ ఇదే..!

ఇప్పటికే దేశంలో మహాత్మాగాంధీ పేరుతో అసలైన మహాత్ముడు… సరిహద్దు గాంధీ పేరుతో మరికొంత మంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వీరి జాబితాలో.. కొత్తగా రామ్‌గోపాల్ వర్మ..మరో కొత్త నేతను తీసుకొస్తున్నారు. ఆయనేవరో కాదు.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్. కేసీఆర్ జీవిత చరిత్రను…తెరకెక్కించాలని..రామ్ గోపాల్ వర్మ సంకల్పించారు. ఈ మేరకు.. లోగో తయారు చేసి… ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఆయనకు…ఎగ్రెసివ్ గాంధీ అనే బిరుదు ఇచ్చారు. సినిమా టైటిల్ “టైగర్ కేసీఆర్ “. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా న‌డిపించారన కోణంలో.. ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తోంది. ” ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’ అని క్యాప్షన్‌గా పెట్టారు.

ఇది కేటీఆర్ తండ్రి బ‌యోపిక్ అని చెబుతూ.. ఆంధ్ర పాల‌కుల రాజ్యంలో తెలంగాణ వాసులు ప‌డుతున్న ఇబ్బందుల‌ని చూసి త‌ట్టుకోలేక కేసీఆర్ ఏం చేశార‌న్నది సినిమాలో చూపిస్తామ‌ని వ‌ర్మ ప్రకటించారు. రామ్‌గోపాల్ వర్మ ఇలాంటి..బయోపిక్‌ల పేర్లతో ఇప్పటికి చాలా… టైటిల్స్ రిలీజ్ చేశారు. ఇందులో నయీం దగ్గర్నుంచి శశికళ వరకూ చాలా ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా.. కేసీఆర్ కూడా చేరారు. దీన్ని తెరకెక్కిస్తారా.. లేకపోతే… టైటిల్ ప్రకటనకే సరిపుచ్చుతారా అన్నది.. ఆయనకు దొరికే నిర్మాతల్ని బట్టి ఉండొచ్చు. సమీపంలో ఇక ఎన్నికలేమీ ఉండకపోవచ్చు కాబట్టి… ఇప్పుడల్లా… ఆ సినిమా తెరకెక్కే అవకాశాలు లేవంటున్నారు.

పైగా రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ ప్రకారం… పాజిటివ్‌గా సినిమాలు తీయడం అనేది ఉండదు. ఏదైనా నెగెటివే. ఇప్పుడు కేసీఆర్ గురించి ఆయన పాజిటివ్ గా సినిమా తీస్తారని ఎవరూ అనుకోవడం లేదు. గతంలో..కేసీఆర్ ముక్కుపై.. అందంపై అనేక కామెంట్లు చేసి ఉన్నారు వర్మ. ప్రస్తుతం వర్మ.. ‘కోబ్రా’ అనే చిత్రంలో నటుడిగా కనిపించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకీ వాకిట్లో… మ‌ల్టీస్టార‌ర్ల చెట్టు!

మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే.. ఇది వ‌ర‌కు హీరోలు భ‌య‌ప‌డిపోయేవారు. క‌థ కుద‌ర‌దండీ.. ఇమేజ్‌లు అడ్డొస్తాయి.. బ‌డ్జెట్లు స‌రిపోవు... - ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పేవారు. క‌థ‌లు ఉన్నా, వాటిని చేయ‌డానికి హీరోలు ధైర్యం చూపించేవారు. ఈగో గోడ‌లు అడ్డొచ్చేవి. అయితే...

నాని సినిమాకి ‘బ‌డ్జెట్‌’ స‌మ‌స్య‌

నాని సినిమాల‌కున్న గొప్ప ల‌క్ష‌ణం ఏమిటంటే.. త‌న మార్కెట్ ప‌రిధిని దాటి ఎప్పుడూ ఖ‌ర్చు చేయ‌నివ్వ‌డు. అందుకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో బ‌య‌ట‌ప‌డిపోతాడు. బ‌డ్జెట్ దాటుతోందంటే.....

కోర్టు ను విమర్శించిన మా వాళ్ళంతా నిరక్షరాస్యులే: వైకాపా నేత

ఇటీవలికాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకుంటున్న అవకతవక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేయడానికి కుదరదని ప్రభుత్వాలకు...

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

HOT NEWS

[X] Close
[X] Close