బూత్‌ల వారీగా లెక్కలేసిన తర్వాత 120 సీట్లు..! టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు లెక్క..!

మూడు రోజుల నుంచి పోలింగ్ బూత్‌ల వారీగా.. సమాచారాన్ని సేకరించిన చంద్రబాబు.. .. తెలుగుదేశం పార్టీ 120స్థానాలు గెలవబోతోందన్న అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. పోటీ చేసిన 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, 25 నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల సర్వేలు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకున్న తర్వాతే.. 120సీట్ల లెక్క చెబుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ నెల ఇరవై రెండో తేదీన అందరూ అమరావతికి రావాలని ఆదేశించారు. ఆ రోజున అభ్యర్థులందరితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈనెల 23 నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తాననని చంద్రబాబు తెలిపారు.

టెలీకాన్ఫరెన్స్‌లో పలువురు అభ్యర్థులు.. తమకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించారు. పీలేరులో ఎన్నికల కమిషన్‌…ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని చెప్పిన కిశోర్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే ఎన్నికల కమిషన్‌పై పోరాడుతున్నానని చంద్రబాబు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత… పోలైన ఓట్ల వివరాలతో బూతుల్లో ఏజెంట్లకు ఇచ్చే ఫామ్‌-17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ డాక్యుమెంట్లన్నింటినీ జాగ్రత్త చేయాలని ఆదేశాలించారు.

ఈవీఎంలపై పోరాటం పేరుతో.. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో గందరగోళానికి దారి తీశాయి. ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారేమో అనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో వైసీపీ నేతలు.. గెలవబోతున్నామని.. హడావుడి ప్రారంభించారు. నేమ్‌ప్లేట్, మంత్రివర్గం అంటూ.. వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు… అన్నిరకాల విశ్లేషణలు చేసుకుని టీడీపీకి 120 సీట్లకుపైగా వస్తాయని లెక్క చెప్పడంతో.. టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ధైర్యం తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close