ఆర్కే పలుకు : చేతులెత్తేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు !

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన కంటే రాజకీయాల మీద దృష్టి పెట్టి అనవసర , రాజ్యాంగ వ్యతిరేక పాలనా పద్దతులను పాటించి ప్రజావ్యతిరేకతను తీవ్రంగా మూట గట్టుకున్నారని.. ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితికి చేరుకున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో విశ్లేషించారు. ఏపీలో ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజల్లో ఎంత నిగూఢంగా ఉందో బీఆర్టీఎస్ రోడ్‌లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనే సాక్ష్యమని ఆయన అంటున్నారు.

ప్రజల్ని భయపెట్టిన పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడే పరిస్థితి రాను రాను తగ్గిపోతోందని ఉద్యోగ, ఉపాధ్యా య ఆందోళనలు తేల్చి చెబుతున్నాని ఆర్కే స్పష్టం చేశారు. రాష్ట్రం నాశనమైపోయిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని చెత్తపన్ను, ఓటీఎస్ వంటి విషయాల్లో పేద ప్రజలు సైతం ప్రభుత్వంపై నేరుగా విరుచుకుపడుతున్నారని గుర్తు చేశారు. రూ. లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పని చేయని… ఒక్కసాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయని జగన్ తీరు వల్ల ప్రజలకు నష్టం ఇప్పుడే వారికి అర్థమవుతోందంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని జగన్ ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఎంత భారీ విజయం వచ్చిదో అంతే దారుణ పరాజయం ఎదురు వస్తుందని ఆర్కే విశ్లేషించారు.

ఇక కేసీఆర్ … తన అడ్డం పొడుగు మాటలతో ఏ మాత్రం నమ్మలేని రాజకీయ నాయకుడిగా మారిపోయారని ఆర్కే తేల్చేశారు. బీజేపీపై ఆయన పోరాటాన్ని ఎవరూ నమ్మడం లేదంటున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి బీజేపీని హైప్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని… కేసీఆర్ రాజకీయం ఎలా ఉన్నా బీజేపీ మాత్రం తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందని ఆర్కే చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూలై నుంచి తెలంగాణలో అమలు చేయాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నారని.. కేసీఆర్‌కు అసలు సినిమా అప్పట్నుంచి కనిపిస్తుదని ఆర్కే విశ్లేషించారు.

బీజేపీని వ్యతిరేకించే క్రమంలో రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసి కేసీఆర్ తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నారని దళిత బంధు పథకంతో వారి మద్దతు పొందాలనుకున్న కేసీఆర్ ఇప్పుడు.. అసలుకే మోసం తెచ్చుకున్నారని అంటున్నారు. పరిస్థితులు చూస్తూంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులెత్తేసి తమను తాము కాపాడుకోవడానికి అడ్డగోలు పనులు చేస్తున్నారన్న ఓ సందేశాన్ని ఈ వారం “కొత్తపలుకు” ద్వారా ఆర్కే ప్రజల్లోకి పంపారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాత కలెక్టర్లు ప్రొబేషన్ ఇస్తారట – ఇదేం ఫిట్టింగ్ !?

గ్రామ, వార్డు సచివాలయ ప్రొబేషన్ల వ్యవహారాన్ని గందరగోళం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పరీక్షలు పేరుతో... ఓటీఎస్ సొమ్ముల పేరుతో సగం మందికి ప్రొబేషన్ కు అనర్హుల్ని చేసేసిన ప్రభుత్వం ఇప్పుడు...

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close