అదే లెక్క.. ఇంతకీ ఉద్యోగులు ఏం సాధించారు?

ఉద్యోగ సంఘ నేతలు మూడు షరతుల మీద చర్చలకు వెళ్లకుండా ఆగి.. చివరికి ఆ షరతులేమీ పట్టించుకోకుడా చర్చలకు వెళ్లి ప్రభుత్వం చెప్పింది విని బయటకు వచ్చి ఇప్పుడే ఆందోళన విరమిస్తున్నాం.. నల్ల బ్యాడ్జీలు తీస్తున్నామని ప్రకటించారు. ఇంత గొప్పగా స్పందన ఇచ్చారు మరి ప్రభుత్వం ఏమిచ్చిందా అని ఉద్యోగులు ఒక సారి చూసుకుంటే వారి మీద వారికే కోపం వచ్చేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిన దానికి జీవోలో ఇచ్చిన దానికి పెద్ద తేడా లేదు. అక్కడా లెక్కల మాయాజాలం చూపించారు.

మాకు పాత జీతాలో ఇవ్వండి మహా ప్రభో అని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. గత ప్రభుత్వాల హయాంలో పోరాడి సాధించుకున్న హెచ్‌ఆర్ఏల లాంటి అలెవెన్స్‌లు మీరెందుకు తగ్గిస్తారని పోరాడినా ప్రయోజనం లేకపోయింది. వాటిని మళ్లీ యథాతథ స్థితికి తెస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. కానీ శ్లాబ్‌లు కాస్త మార్చింది.. కానీ ఓ క్యాప్ పెట్టింది. ఇంత మొత్తం కన్నా ఎక్కువ ఇవ్వబోమని చెప్పింది. అంటే… ఓ స్థాయి ఉద్యోగులకు పెరిగేదేమీ ఉండదన్నమాట. సీసీఎను పునరుర్ధరస్తామన్నది మాత్రం కాస్త ఊరట. గతంలో ఉండేది. రద్దు చేశారు. ఇప్పుడు ఇస్తామన్నారు. అంతకు మించి కొత్తగా ఇచ్చేదేమీ లేదు.

ఇక ఏ డిమాండ్ విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. సీపీఎస్ రద్దు దగ్గర్నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల వరకూ ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఉద్యోగ సంఘ నేతలు మాత్రం ఇంత కాలం ఉద్యోగుల ఆవేశం కారణంగా అభిమానాన్ని దాచి పెట్టుకుని చేసిన మాటలన్నింటికీ పరిహారంగా .. క్షమాపణ మాటలు ప్రకటించేశారు. ముఖ్యమంత్రికి సన్మానాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

వంద రూపాయలు తగ్గించేసి… రోడ్డెక్కిన తర్వతా ఇరవై రూపాయలు తిరిగి ఇస్తే సంబరాలు చేసుకుంటున్నట్లుగా ప్రస్తుతం ఉద్యోగ సంఘ నేతల తీరు ఉంది. ఇలాంటి నాయకుల వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుందో లేదో వారికి.., ప్రభుత్వానికి మాత్రం ఎంతో వెసులుబాటు లభిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close