ఆర్కే ప్రశ్న : సిగ్గనిపించడం లేదా ఆఫీసర్స్..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో రాసే కొత్తపలుకు ఆర్టికల్‌లో ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులపై విరుచుకుపడ్డారు. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు వ్యతిేకంగా అధికారులు … చట్ట వ్యతిరేకంగా.. రాజ్యాంగ వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను వివరిస్తూ.. ప్రజలిచ్చిన తీతాలు తీసుకుంటూ.. ప్రజలకే ద్రోహం చేయడం.. సిగ్గనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఇందులో కొంత మంది ఉన్నతాధికారుల పేర్లను కూడా సూటిగా .. సుత్తి లేకుండా ప్రస్తావించారు. ఏపీలో వ్యవస్థలన్నీ న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నా… ఆయా అధికారులు ఏ మాత్రం సిగ్గులేకుండా .. ఎలా ఉండగలగుతున్నారని ఆర్కే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దేశంలో ఏ పోలీస్ బాస్‌ కూ.., హైకోర్టులో నిలబడి.. ఓ సెక్షన్‌ చదివి న్యాయమూర్తులకు వినపించాల్సిన పరిస్థితి రాలేదు. పోలీసులు ఎంత చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో… హైకోర్టు ప్రత్యేకంగా తీర్పు ద్వారా కాకుండా.. ఈ చర్య ద్వారానే తేల్చి చెప్పింది. ఆ తర్వాతైనా డీజీపీ తీరులో మార్పు వస్తుందనుకుంటే రాలేదని ఆర్కే అభిప్రాయం. ” . చట్టాలకు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అఖిల భారత సర్వీసు ఉన్నతాధికారులు కూడా ఈ పాపంలో పాలుపంచుకోవడం విషాదం!” అని తేల్చేశారు. ముఖ్యంగా డీజీపీ గౌతం సవాంగ్‌పై ఆర్కే విరుచుకుపడ్డారు. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఏపీ పోలీసులపైనే నమ్మకం లేదన్న వ్యక్తి కోసం ఇప్పుడు దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగితే.. నడి రోడ్డుపై హత్యలు చేసినా పట్టించుకునేవారు ఉండరని..ఆ పరిస్థితి త్వరలోనే వస్తుందని.. ఆర్కే జోస్యం చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పైనా.. ” సిగ్గు ” ఎటాక్ చేశారు ఆర్కే. ఆయన నిమిత్తమాత్రుడిగా మారి… ప్రజాస్వామ్యానికే ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలో రిటైరయ్యే ఆయన.. సిన్సియర్‌గా చేస్తే.. తను చేస్తున్న ఉద్యోగానికి సార్థకత ఉండేదని.. ఇప్పుడు వ్యవస్థను కుప్పకూల్చి ఆయన సాధించేదేమిటని ప్రశ్నించారు. రిటైరన తర్వాత అధికారులంతా హైదరాబాద్‌లో స్థిరపడతారని.. ఏపీ ఏమైపోతే తమకెందుకన్నట్లుగా ఉంటున్నారని విమర్శలు గుప్పించారు.

వేమూరి రాధాకృష్ణ.. ఇప్పటి వరకూ రాజకీయ పరంగా … తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. మొదటి సారి అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. వారు .. సివిల్ సర్వీస్ గీత దాటిపోతున్నారని మండిపడ్డారు. తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. వ్యవస్థలు నాశనమైపోతున్నాయని… ఆర్కే బాధకావొచ్చు. జర్నలిస్టుగా ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు… ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఎవరికైనా.. ఇబ్బందికరంగా అనిపించకమానవు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అది ప్రజల ద్వారానే జరగాలి. వారి పేరుతో.. ప్రభుత్వమో.. అధికారయంత్రాంగమో.., ఫలితాలను నిర్దేశిస్తే.. అది ప్రజాస్వామ్యం కాదు.. నియంతృత్వం అవుతుంది. ప్రస్తుతం ఏపీ ఆ దిశగానే ఉంది.. ఆ పాపంలో.. ప్రజల సొమ్మే.. జీతాలుగా తీసుకుంటున్న అఖిల భారత సర్వీస్ వ్యవస్థ భాగమవుతోంది.. అదే ఆర్కే ..తనదైన పద్దతిలో చెప్పే ప్రయత్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close