ఆర్కే పలుకు : షర్మిల సాక్ష్యం ఇంపార్టెంట్ !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చాలా కాలంగా తదనైన వాణి వినిపిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన జగన్ సోదరి షర్మిలను ఈ విషయంలో తెరపైకి తెచ్చారు. ఇప్పుడు తన వారాంతపు ఆర్టికల్ “కొత్త పలుకు”లో మరోసారి అదే వాదన వినిపించారు. షర్మిల సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. అయినా సీబీఐ తీసుకోవడం లేదని ఆయన చెబుతున్నారు. ఆర్కే షర్మిల సాక్ష్యం గురించి చెప్పడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఓ “కొత్తపలుకు” లో సీబీఐ అధికారులు షర్మిలను సంప్రదించారని ఆమె కొన్ని కీలక విషయాలు చెప్పారని.. స్టేట్ మెంట్ ఇచ్చేందుకు షర్మిల, తీసుకునేందుకు సీబీఐ అంగీకరిచిందని చెప్పారు. ఇప్పుడు తన వాదనను మరోసారి గుర్తు చేసేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో సీబీఐ అధికారుల షర్మిల స్టేట్‌మెంట్ తీసుకుంటామని చెప్పారని కానీ ఇప్పుడు తీసుకోవడం లేదని అంటున్నారు.

ఓ వైపు సీబీఐ అధికారులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల వంటి వారు చంద్రబాబు డైరక్షన్‌లో సీబీఐ పని చేస్తోందని అంటున్నారు. అయితే ఆర్కే నుంచి దాదాపుగా కాస్త భిన్నమైనా అవే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరో సీబీఐపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అయితే ఆర్కే వాదన భిన్నమైనది. సీబీఐపై ఒత్తిడి తెస్తోంది షర్మిల స్టేట్‌మెంట్ తీసుకోకుండానట. వివేకానందరెడ్డి హత్యకు గురి కాక ముందు కడప పార్లమెంట్ స్థానం నుంచి అయితే తాను పోటీ చేయాలి లేకపోతే షర్మిల పోటీ చేయాలని ఆన్నారట. అదే విషయాన్ని స్టేట్‌మెంట్‌గా ఇవ్వడానికి షర్మిల సిద్ధపడినా సీబీఐ అధికారులు ముందుకు రావడం లేదంటున్నారు ఆర్కే.

ఈ వారం ఆర్టికల్‌గా ఏపీకి సంబంధించినంత వరకూ పూర్తిగా వివేకా హత్య కేసుపైనే విశ్లేషించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డే నిందితులని తేలిందని ఆయన పరోక్షంగా నిర్ధారించారు. అయితే వారిని అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఆయనకు సందేహాలున్నాయి. అందుకే భిన్నమైన వాదన వినిపించారు. మరో వైపు కేసీఆర్ చేస్తున్న బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ రాజకీయాలపైనా ఆర్కే తనదైన విశ్లేషణచేశారు కానీ ఆయన చంద్రబాబుతో పోల్చారు. చంద్రబాబు గతంలో ఇలానే చేసి దారుణంగా దెబ్బలు తిన్నారని విశ్లేషించారు.. అయితే కేసీఆర్‌కు మరో మార్గం లేదంటున్నారు.

అయితే కేసీఆర్‌కు ఆర్కే పరోక్షంగా చాలా సలహాలిచ్చారు. దానికి కారణాలు కూడా చెప్పారు. ప్రాంతీయ పార్టీలు.. ప్రాంతీయంగా రాజకీయాలు చూసుకుంటేనే ప్రజలు ప్రోత్సహిస్తారు తప్ప.. జాతీయ రాజకీయాల వైపు చూస్తే ప్రజలే కింద పడేస్తారని.. దానికి ఇతర ఉదాహరణలు కూడా చెప్పారు. ఆయన చెప్పినవి కరెక్ట్‌గానే ఉన్నాయి. అయితే కేసీఆర్ స్టైలే వేరు. మార్చి పదో తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలు.. ప్రాంతీయ పార్టీల రాజకీయం ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుందని ఆర్కే తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close