పార్టీలో నారా లోకేష్ పోషించాల్సిన పాత్ర ఏంటి..?

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత, ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో ఇవాళ్ల అసెంబ్లీలోకి టీడీపీ అడుగుపెడుతోంది. నిజానికి, ఆ పార్టీకి ఇదేమీ కొత్త అనుభ‌వం కాదు. దివంగ‌త‌ వైయ‌స్సార్ హ‌యాంలో దాదాపు ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలోనే ఉంది. అయితే, ఇప్పుడు అతి త‌క్కువ ఎమ్మెల్యేల సంఖ్య‌తో ఇప్పుడు స‌భ‌లోకి వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో, అసెంబ్లీలో ఎలాంటి పాత్ర పోషించాలి, ఎమ్మెల్యేలంతా ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై నిన్న‌నే చాలా చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాత్ర ఎలా ఉండాల‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయంగా మారుతోంది. నిన్న‌టి స‌మావేశంలో దీన్ని ప్ర‌ముఖంగా నేత‌లు చ‌ర్చించ‌క‌పోయినా, ఆఫ్ ద రికార్డ్ కొంత‌మంది నాయ‌కులు కొన్ని అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

గ‌త ప్ర‌భుత్వంలో లోకేష్ మంత్రిగా ప‌నిచేశారు. అంటే, కొంత అనుభ‌వం వ‌చ్చిన‌ట్టే. అయితే, ఇక‌పై పూర్తిగా ప్ర‌జ‌ల్లో ఉండాల‌నీ, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులోకి ఉండాల‌ని ఆయ‌నే నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే ఊరుకోనంటూ ఆయ‌న వ్యాఖ్యానించిన సంగ‌తీ తెలిసిందే. ఇదే పంథాను ఆయ‌న కొన‌సాగిస్తే మంచిది అనేది పార్టీ నేత‌ల అభిప్రాయంగా గెలుస్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లున్నాయి. కాబ‌ట్టి, మండ‌లాలవారీగా పార్టీ స‌మీక్ష‌లు నిర్వ‌హించాల‌నీ, వీటిని నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగితే బాగుంటుంద‌నే అభిప్రాయ‌మూ వ్య‌క్త‌మైన‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు, ప్ర‌భుత్వ విధానాల‌పై పార్టీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు స్పందిస్తార‌నీ, కార్య‌క‌ర్త‌లూ పార్టీల‌కి సంబంధించిన ఇత‌ర వ్య‌వ‌హారాల్లో లోకేష్ ని మరింత క్రియాశీలం చేయాల‌నే ఉద్దేశంలో పార్టీ ఉంది.

వ‌య‌సు రీత్యా చంద్ర‌బాబు నాయుడు మ‌రో ఐదేళ్ల‌పాటు పార్టీని ఎలా న‌డిపిస్తారూ అనే అభిప్రాయాలూ పార్టీలోనే వినిపిస్తున్నాయి. కానీ, ఆయ‌న చాలా ఫిట్ గా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం ఆయ‌న‌కీ కొత్త కాదు. కాక‌పోతే, ఆయ‌న త‌రువాతి స్థానంలో నారా లోకేష్ మ‌రింత స‌మ‌ర్థంగా క‌నిపించాల్సిన స‌మ‌యం ఇప్పుడు వ‌చ్చింది. సవాళ్ల‌లోంచి అవ‌కాశాల‌ను సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు త‌ర‌చూ చెబుతుంటారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నారా లోకేష్ ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీలో, ప్ర‌జ‌ల్లో త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను ఆయ‌న బిల్డ‌ప్ చేసుకోవాలంటే దానికి వేరే ఏ షార్ట్ కట్ అంటూ ఏం లేదు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల్సిందే, స‌మ‌స్య‌ల‌పై నిత్యం పోరాటం చేయాల్సిందే, ఎండావానా అన‌కుండా క‌ష్ట‌ప‌డాల్సిందే, అధికార పార్టీ నుంచి ఎదు‌ర‌య్యే అన‌నుకూల ప‌రిస్థితుల‌ను ఫేస్ చేయాల్సిందే, అంతిమంగా రాటు దేలాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close