అసెంబ్లీ సమరంలో నేటి వైఎస్‌తో చంద్రబాబు పోటీ పడగలరా..?

2014లో నవ్యాంధ్ర తొలి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 2019లో వీరిద్దరి స్థానాలు మారిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. కానీ.. ఈ సారి చంద్రబాబుకు.. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అదొక్కటే తేడా.

అధికార ప్రతిపక్షాలంటే వైఎస్ వర్సెస్ నారా..!

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నతం. అర్థవంతమైన చర్చలు జరిగితే.. సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అలా ఉండాలంటే.. పోటాపోటీ నాయకులు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అధికార ప్రతిపక్ష నేతలు అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులే. ఒకరు అధికారపక్షంగా ఉంటే.. మరొకరు ప్రతిపక్ష పార్టీగా ఉండేవారు. ఇద్దరూ వ్యక్తిగతంగా మిత్రులైనా.. రాజకీయంగా బద్ద ప్రత్యర్థులు కాబట్టి.. అసెంబ్లీలో అయినా.. బయట అయినా.. రాజకీయ పోరాటం హోరాహోరీగా సాగేది. అందుకే రాజకీయం రక్తి కట్టేది.

వైఎస్ వర్సెస్ చంద్రబాబు అంటే క్రికెట్ కూడా దిగదుడుపే..!

చంద్రబాబు వర్సెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా అసెంబ్లీలో చర్చలు జరిగితే ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ కు ఉన్నంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు.. వైఎస్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన వైఎస్ స్థాయి రాజకీయం చేస్తారా… అర్థవంతమైన చర్చలకు ఆస్కారం కల్పిస్తారా.. అన్నది రాజకీయవర్గాలకు ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. ఎందుకంటే.. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి దూకుడైన రాజకీయం చేస్తారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా.. ఆయన వ్యవహారశైలి అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఎలా ఉంటారన్నదే కీలకం. టీడీపీకి సంఖ్యాబలం కూడా తక్కువే ఉంది కాబట్టి… ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోకుండా… సభను నడిపించే వ్యూహం అమలు చేయడానికి కూడా జగన్‌కు అవకాశం ఉంటుంది.

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో పోరాటానికి ఆసక్తి చూపని జగన్..!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి… అసెంబ్లీలో పోరాటం కంటే.. బయటే ప్రభుత్వంపై ఎక్కువ పోరాటం చేయడానికి ఆసక్తి చూపించారు. తొలి మూడున్నరేళ్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ.. చర్చలు అంత గొప్పగా సాగలేదు. వివిధ కారణాలతో.. అసెంబ్లీలో రచ్చ జరిగేది. చివరికి జగన్ పాదయాత్ర ప్రారంభించే ముందు.. అసెంబ్లీని బహిష్కరించడంతో.. సమావేశాల్లో పస లేకుండా పోయింది. ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో… ఆ సమావేశాలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షించలేకపోయాయి. అయితే ఈ సారి ప్రతిపక్ష నేత స్థానంలోకి..చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. అనవసర దూకుడు కన్నా… చర్చల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే వ్యూహాన్నే ఆయన అవలంభిస్తారు. అందుకే.. గతంతో పోలిస్తే.. ఈ సారి అర్థవంతమైన చర్చలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బలంతో పనికానిచ్చేస్తారా..? వ్యూహంతో నెగ్గుకొస్తారా..?

ఓ రకంగా ఇప్పుడు సీనియార్టీకి…యువ రక్తానికి మధ్య అసెంబ్లీ పోరు జరుగుతుందనుకోవాలి. దూకుడుగా ఏదైనా సాధించాలనుకోవచ్చనే.. తత్వంతో జగన్మోహన్ రెడ్డి ఉరకలు వేస్తున్నారు. నింపాదిగా అయినా అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయాలనుకునే చంద్రబాబు ఆయనకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. రాజకీయాల్లో ఆలోచనే కావాలి కానీ… ఆవేశం పనికి రాదని గతంలో చాలా సార్లు రుజువయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close