ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్లు నామమాత్రం?

రాజమౌళి సినిమాలో హీరోయిన్లు గ్లామరస్ గా వుండడమే కాదు, కాస్త గట్టి పాత్రలే వుంటాయి. ఈగ లో సమంత అయినా, బాహుబలిలో అనుష్క, తమన్నా, మగధీరలో కాజల్ ఇలా ఎవరు అయినా. అయితే ఈసారి ఆర్ ఆర్ ఆర్ లో మాత్రం హీరోయిన్లకు అంత పెద్ద ప్రాముఖ్యత వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

హీరోలు సెంట్రిక్ గా తిరిగే కథ అని, దాదాపు సినిమా అంతా ఇద్దరు హీరోల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అందుకే రాజమౌళి ఇప్పటి వరకు హీరోయిన్ల ఎంపికపై సీరియస్ గా దృష్టి పెట్టలేదని టాక్. తొలి షెడ్యూలు అయిన తరువాత మలి షెడ్యూలు వేళకు హీరోయిన్ల ఎంపిక జరుగుతుందని గతంలో వార్తలు వినవచ్చాయి. 

కానీ రెండో షెడ్యూలు కూడా మొత్తం హీరోల మీదనే వెళ్తోంది. మూడో షెడ్యూలు వేళకు కానీ హీరోయిన్ల ఎంట్రీ సెట్ మీదకు వుండదని తెలుస్తోంది. ఏమిటిలా? అని ఆరా తీస్తే, ఈ సినిమాలో హీరోయిన్లు వుంటారు. పాత్రలు సరిగ్గానే వుంటాయి కానీ, హీరోల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అందులో భాగంగానే హీరోయిన్లు కనిపిస్తారు కానీ, మరీ ఎక్కువ ప్రాధాన్యత అయితే వుండదు అన్న గ్యాసిప్ సమాధానాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com