అలియా సినిమాకి ప్ల‌స్ కానున్న ‘ఆర్.ఆర్‌.ఆర్‌’

ఆర్‌.ఆర్.ఆర్ తో అలియా భ‌ట్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాలోనూ త‌ను స్థానం సంపాదించింది. టాలీవుడ్ నుంచి మ‌రిన్ని అవ‌కాశాలు అలియాని వెదుక్కుంటూ వెళ్ల‌బోతున్నాయి. ఈలోగా ఆర్‌.ఆర్‌.ఆర్ కంటే ముందుగా అలియా భ‌ట్ సినిమా ఒక‌టి రాబోతోంది. అదే `గంగూభాయ్‌`. సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. సాధార‌ణంగా ఈ సినిమా బాలీవుడ్ కే ప‌రిమితం అవ్వాలి. కానీ.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో వ‌చ్చిన క్రేజ్ తో.. ఈసినిమాని తెలుగులో ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగు ప్ర‌మోష‌న్ల విష‌యంలో అలియా కూడా ప్ర‌త్యేక దృష్టిని సారించింది. శుక్ర‌వారం… గంగూభాయ్ ట్రైల‌ర్ వ‌స్తోంది. అయితే… ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తెలుగు మీడియాకి ఈ ట్రైల‌ర్ ముందే చూపించేసింది చిత్ర‌బృందం. దాంతో పాటుగా తెలుగు మీడియాతో… అలియాభ‌ట్ ప్ర‌త్యేకంగా ములాఖాత్ అయ్యింది.

ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌ల్ల‌… గంగూభాయ్‌కి చాలా ప్లస్ అయ్యింద‌ని చెప్పాలి. ఈ సినిమాని తెలుగులో ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. అలియా కూడా ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం మ‌రోసారి టాలీవుడ్ రాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం రాబోతోంది. స‌రిగ్గా నెల త‌ర‌వాత‌… ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌స్తుంది. గంగూభాయ్ తో అలియా టాలీవుడ్ కి ద‌గ్గ‌రైతే… అది ప‌రోక్షంగా ఆర్‌.ఆర్‌.ఆర్ కి కూడా హెల్ప్ అవుతుంది. ప్ర‌స్తుతానికైతే.. ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌ల్ల గంగూభాయ్‌కి క‌లిసొచ్చిన‌ట్టైంది. గంగూభాయ్ ఓ వేశ్య క‌థ‌. వేశ్యా వాటిక‌లోని ఓ అమ్మాయి.. సంచ‌ల‌న శ‌క్తిగా ఎలా ఎదిగిందో.. సంజ‌య్‌లీలా బ‌న్సాలీ త‌న‌దైన శైలిలో చూపించ‌బోతున్నాడు. ఇదో న‌వ‌లా చిత్రం. ఈ క‌థ‌లో కొన్ని సంచ‌న‌ల విషయాలున్నాయ‌ని తెలుస్తోంది. అదేమిట‌న్న‌ది సినిమా విడుద‌ల అయ్యాకే అర్థం అవుతుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర పోషించారు. అలియాతో పాటుగా అజ‌య్ కూడా ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close