రిజర్వేషన్ల పై ఆర్ ఎస్ ఎస్ – యూ టర్న్

రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉందని గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా సామాజిక వివక్ష వున్నంతవరకు దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలన్నదే తన అభిమతమని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ – మోహన్‌ భగవత్‌ చెప్పారు.

రిజర్వేషన్ల రద్దుకు సంఘ్ అనుకూలం కాదని అన్నారు. నాగపూర్ లో ‘సామాజిక సమానత్వం’ అనే అంశం పై ఆయన ఉపన్యశించారి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించాలంటూ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ఆ ఎన్నికల్లో బిజెపి ఓటమికి ఇది కూడా ఒక కారణమని అనేక విశ్లేషణల్లో బయట పడింది.

సామాజిక సమానత్వం అనేది ముందుగా వ్యక్తిగతంగా ప్రారంభం కావాలని, ఆ తర్వాత కుటుంబం, విస్తృత కుటుంబం, సమాజం ఇలా విస్తరించుకుంటూ పోవాలని అన్నారు. సమాజంలోని వైవిధ్యతను గౌరవిస్తూనే ఇది జరగాలన్నారు. సామాజిక సామరస్యత, సమగ్రత భావనను వివరిస్తూ, ఏ మతం, తెగ, సామాజిక సంస్కర్త లేదా సాధువు కూడా మానవుల మధ్య వివక్షను సమర్ధించలేదని అన్నారు.

ఈ వివక్షను అంతమొందించాల్సిన అవసరం వుందని మోహన్ భగత్ గట్టిగా చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close