పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశానికి క్రికెట్ ప్రపంచకప్ అందించిన దిగ్గజం ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో చంపేశారన్న ప్రచారం ఉద్దృతంగా సాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు పాకిస్తాన్ లో అలజడి రేపుతున్నారు. ఇమ్రాన్ క్షేమ సమాచారం చెప్పాలని ఆయనను బయటకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరందర్నీ పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది కానీ ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారం మాత్రం చెప్పడం లేదు. అందుకే పాకిస్తాన్ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.
ఆప్ఘన్ నుంచి పప్రారంభమైన ప్రచారం
అఫ్ఘాన్ మీడియా ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో రహస్యంగా చంపేశారు. అతని శవాన్ని జైలు నుంచి తరలించారు ప్రచారం చేస్తున్నాయి. ఆఫ్ఘన్ రక్షణ శాఖ కూడా అదే ప్రకటించింది. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఓ సీనియర్ పాక్ ఆర్మీ అధికారి చెప్పినట్లుగా ప్రచురించారు. కొందరు ఇమ్రాన్ ఖాన్ స్ట్రెచర్‌పై పడుకున్న వీడియోలు పోస్ట్ చేశారు, కానీ అవి ఫేక్‌గా తేల్చారు. పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడని అంటున్నారు. కానీ బయటకు చూపించకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టి.. ఆయన పార్టీపై నిషేధం
గతంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది. అప్పుడు ఆర్మీ ఆయనకు మద్దతుగా నిలిచింది. అయితే ఆర్మీ చీఫ్ గా అసిమ్ మునీర్ ఇమ్రాన్ పై కుట్ర పన్నారు. దాంతో ఆయన అధికారం కోల్పోయారు. ఆ తర్వతా ఇమ్రాన్ పై కేసులు పెట్టి జైలుకు పంపారు. అవినీతి, రాజద్రోహం వంటి 20కి పైగా కేసులు పెట్టి వెంటనే శిక్ష కూడా వేశారు. జైలు నుంచే అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తున్నారు. గత నెలలో సైనిక అధిపతి అసీమ్ మునీర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్‌ల ఫలితాలపైనా స్పందించారు. కానీ ఇటీవల ఆయన గురించి సమాచారం బయటకు రావడం లేదు.
ఇమ్రాన్‌ఖాన్‌కు ఏమైనా జరిగితే పాకిస్తాన్లో జెన్ జీ విప్లవం
ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీ పీటీఐ ను నిషేధించినప్పటికీ ఆ పార్టీ సానుభూతిపరులు గత ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి భారీ సంఖ్యలో విజయం సాధించారు. అప్పుడప్పుడు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఏమైనా జరిగిందని తేలితే.. జనరేషన్ జెడ్ అంతా ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. సైనికాధికారులు పాలకులు పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇమ్రాన్ ఖాన్‌కు ఏమీ జరగకపోతే ఆయనను ప్రజలకు చూపిస్తారు. లేకపోతే ప్రజల అనుమానాలు బలపడి.. మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతాయి.