హీరోల‌కు, నిర్మాత‌ల‌కు దూరంగా సుజిత్

రెండో సినిమాకే 250 కోట్ల బడ్జెట్ చేతిలోకి తీసుకున్నాాడు సుజిత్. అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తీసే అవకాశం దక్కింది. అందునా…. బాహుబలి తరవాత ప్రభాస్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అంటే మాటలా..? ఎన్ని ర‌కాలుగా చూసినా, సుజిత్ అదృష్ట‌వంతుడే. ప్ర‌భాస్ కోసం ఇన్నేళ్లు ఎదురుచూసినందుకు త‌గిన ప్ర‌తిఫ‌ల‌మే దొరికింది.

సుజిత్ కెపాసిటీపై ఎవ్వ‌రికీ ఎలాంటి డౌట్లూ లేవు. కానీ ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? అనే అనుమానం మాత్రం అంద‌రిలోనూ ఉంది. కానీ ట్రైల‌ర్ చూశాక అవ‌న్నీ ప‌టాపంచ‌లైపోయాయి. ప్ర‌భాస్ చెప్పిన‌ట్టు ‘అంత‌ర్జాతీయ స్థాయి ద‌ర్శ‌కుడు’ అయ్యే ల‌క్ష‌ణాలు సుజిత్ లో పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ‘సాహో’ ఏవ‌రేజ్ అనిపించుకున్నా స‌రే, నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు ఎస‌రు పెట్టేస్తారు. అందుకే సుజిత్‌పై అంద‌రి క‌ళ్లూ ప‌డ్డాయి. హీరోలు, నిర్మాత‌లు సుజిత్‌పై క‌ర్చీఫ్‌వేసుకోవ‌డానికి ట్రై చేస్తున్నారు. కానీ… సుజిత్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రి ద‌గ్గ‌రా అడ్వాన్సు తీసుకోలేదు. ఏ హీరోకీ మాట ఇవ్వ‌లేదు. సినిమా అటూ ఇటూ అయితే ఫ‌లితం ఎలా ఉంటుందో త‌న‌కు తెలుసు. సినిమా సూప‌ర్ హిట్ట‌యినా – జాత‌కాలు మారిపోతాయ‌నీ తెలుసు. అందుకే అడ్వాన్సుల‌కు దూరంగా ఉన్నాడు సుజిత్‌. ఎవ‌రు క‌లిసినా ‘సాహో త‌ర‌వాతే మాట్లాడ‌దాం’ అంటున్నాడ‌ట‌. పైగా సుజిత్ త‌న త‌దుప‌రి సినిమానీ యూవీ క్రియేష‌న్స్‌కే చేసే అవ‌కాశం ఉంది. అందుకే.. సుజిత్ కామ్‌గా ఉంటున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close