పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారని తాజా సమాచారం. కానీ ఇది నిఘా వర్గాలు చెప్పిన మాట కాదు. విశ్వహిందూ పరిషత్ సభ్యురాలు సాద్వి ప్రాచి కనిపెట్టి తెలియజేసారు. మన పార్లమెంటులో కొందరు సభ్యులు యాకుబ్ మీమన్ని ఉరి తీయడాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదికి మద్దతు పలికేవారు కూడా ఉగ్రవాదులేనని అటువంటి వారు మన పార్లమెంటులో ఒకరిద్దరున్నారని సాద్వి ప్రాచి అన్నారు. మన పార్లమెంటులో అటువంటి వారికి చోటుండటం చాల దురదృష్టకరమని ఆమె అన్నారు. ఇటీవల సజీవంగా పట్టుబడిన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ని హిందూ సంస్థలకు అప్పగించినట్లయితే అతనికి తగిన గుణపాఠం చెప్పగలరని ఆమె మరో వివాదాస్పద వ్యాక్య చేసారు. పార్లమెంటు సభ్యులను ఉగ్రవాదులని అన్నందుకు ఆమెపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆమె సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ ఈవిధంగా తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. కానీ ఆమె తన తీరు మార్చుకోలేదు.