తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. ఇంకా అవసరం ఉందా?

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సాధన కొరకు అనేక జె.ఏ.సీలు ఉద్భవించాయి. వాటి లక్ష్యం-తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతోనే వాటిలో చాలా వరకు స్వచ్చందంగా రద్దు చేసుకొన్నాయి. కానీ నేటికీ తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. ప్రొఫెసర్ కోదండ రామ్ నేతృత్వంలో సజీవంగానే ఉంది. తెలంగాణా కోసం పోరాడిన తెరాసయే ఇప్పుడు అధికారంలో ఉంది. తెలంగాణాను సాధించిన కేసీఆరే దానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్య, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ పధకాలకు ఆయన చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని స్వయంగా కోదండ రామ్ కూడా అంగీకరిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి పధంలో ముందుకు నడిపిస్తున్నారని తెలంగాణా ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే ఆయన చెప్పినట్లు ‘బంగారి తెలంగాణా’ సాధన కోసం సరయిన దిశలోనే ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఒకవేళ కేసీఆర్ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తే, ప్రతిపక్షాలు అంకుశంగా వ్యవహరిస్తూ దారి తప్పకుండా నియంత్రించగలవు. అది ప్రతిపక్షాలుగా వాటి బాధ్యత కూడా. అటువంటప్పుడు ఇంకా తెలంగాణా రాజకీయ జె.ఏ.సీని సజీవంగా ఉంచవలసిన అవసరం ఉందా? అనే సందేహం కలుగుతుంది.

తెలంగాణా ఏర్పడిన తరువాత అన్ని జె.ఏ.సి.లు ఒకటొకటిగా స్వచ్చందంగా రద్దు చేసుకొంటుంటే, తెలంగాణా రాజకీయ జె.ఏ.సీ. మాత్రం బంగారి తెలంగాణాలో తాము నిర్మాణాత్మకమయిన పాత్ర పోషిస్తామని దానిని సజీవంగా ఉంచారు. కానీ తమను ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన బెట్టారని ఒకసారేప్పుడో ప్రొఫెసర్ కోదండ రామ్ స్వయంగా చెప్పుకొని బాధపడ్డారు. అంటే తెలంగాణా పునర్నిర్మాణంలో తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. పాత్ర ఏమీ లేదని అర్ధమవుతోంది.

పోనీ తెరాస ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న అనేక వివాద స్పద నిర్ణయాలనయినా తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. దైర్యంగా ప్రశ్నించగలిగిందా? అంటే అదీ లేదు. ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో అనేక విషయాలలో అది మౌనం వహించింది. ఉదాహరణకి తెలంగాణా ప్రభుత్వం కేవలం 456 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తించినప్పుడు తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. తమ వద్ద అసలు జాబితా ఉందని చెప్పిందే తప్ప తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న సుమారు 1200 మంది కుటుంబాలకు న్యాయం కోసం పోరాడే సాహసం చేయలేకపోయింది.

తెలంగాణా పునర్నిర్మాణంలో పాలుపంచుకోలేక, తెరాస ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపలేకపోతున్న తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. ఇప్పుడు సంపూర్ణ తెలంగాణా సాధన కోసం పోరాడేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ దాని కోసం పోరాడుతున్నప్పుడు, ఇక తెలంగాణా రాజకీయ జె.ఏ.సి.పోరాడవలసిన అవసరం ఏమిటో…అసలు ఒక రాజకీయ పార్టీ కూడా కానిది అది ఎవరిపైన, ఏవిధంగా పోరాడుతుందో ఎవరికీ తెలియదు.

ఉదాహరణకి ఇప్పుడు తెరాస ప్రభుత్వం హైకోర్టు విభజన గురించి పార్లమెంటులో, న్యాయస్థానాలలో కేంద్రంతో, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా గట్టిగా పోరాడుతోంది. దానికి తెలంగాణా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కూడా. అటువంటప్పుడు తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. ఈవిషయంలో కొత్తగా ఏమి పోరాడుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కనీసం రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తమ పోరాటాలకి దాని సహకారం కోరి ఉన్నా అర్ధం చేసుకోవచ్చును. కానీ ఎవరూ కూడా దానిని సంప్రదించడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. అటువంటప్పుడు సంపూర్ణ తెలంగాణా సాధన కోసం పోరాడుతానని తెలంగాణా రాజకీయ జె.ఏ.సి. చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.

నిజానికది రాజకీయ నిరుద్యోగులకు లేదా రాజకీయాలలో చేరాలనే ఆసక్తి కలిగిన ప్రభుత్వోద్యోగులకు ఒక ‘ప్లాట్ ఫారం’ గా మాత్రమే మిగిలి ఉందని చెప్పవచ్చును. ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా రాష్ట్రం సరయిన దిశలోనే ముందుకు సాగుతోందని ప్రొఫెసర్ కోదండ రామ్ భావిస్తున్నట్లయితే ఆయన కనుక ఇప్పటికయినా తన తెలంగాణా రాజకీయ జె.ఏ.సి.ని రద్దు చేసి తిరిగి ఉస్మానియాలో తన విధులలో చేరి విద్యార్ధులకు మార్గదర్శనం చేస్తే అందరూ హర్షిస్తారు. లేకుంటే మున్ముందు ఏదో ఒకరోజు తనను ఆదరించిన ప్రజల మధ్యనే ఆయన నవ్వులపాలు కాక తప్పక పోవచ్చును.

ఇది ఆయనను విమర్శించే ఉద్దేశ్యంతోనో కించపరిచే ఉద్దేశ్యంతోనో చెపుతున్న మాట కాదు. తెలంగాణా సాధన కోసం కేసీఆర్ తో సమానంగా పోరాడిన ఒక యోధుడికి ముందు అవమానకర పరిస్థితులు ఎదురవుతాయనే ఆలోచనతోనే చెప్తున్నా ఒక చిన్న సలహా మాత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close