సెటైర్:రైలుపట్టాల ప్రెస్ మీట్

`నేను రైలుపట్టాని. ఒట్టి ఇనుపముక్కనేకావచ్చు, అయినా నాకు తిక్కరేగింది. అందుకే ఇవ్వాళ ఉన్నట్టుండి ప్రెస్ మీట్ పెట్టేశాను. అదిగో ఏంటా లుక్కూ… ఏం తప్పా ? నేను ప్రెస్ మీట్ పెట్టకూడదా ? ఏంటీ, అదోలా నావైపు చూస్తున్నారు, ఓహో, ప్రమాదం జరిగిన తర్వాత ఇంతలేటుగా ఈ ప్రెస్ మీట్ ఏంటా అనేనా? రెండురోజులు లేటుగా మిమ్మల్ని కలవడానికి కారణం ఉంది గురూ. ప్రమాదం జరిగిన వెంటనే `రండర్రా..’ అంటే మీరువస్తారుకనుకనా, అప్పుడు మీరంతా యమబిజీగా ఉంటారుకదా, పైగా మీవార్తల్లో ఎంతసేపటికీ `పట్టాలుతప్పిన రైలు, పట్టాలు తప్పిన రైలం’టూ ఊకదంపుడు దంచుతారే తప్పవాస్తవాలు రాయరు. మీరు రాసేదంతా నిజమేనా, తప్పంతా నాదేనా ? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా నాగురించి ఆలోచించారా, నేను ఎందుకని అలా వీకయ్యానో, నాపైన పరిగెత్తే బోగాలను బోల్తా ఎందుకు కొట్టిస్తున్నానో ఆలోచించారా…? లేదు, అలా ఆలోచించిఉండరు.

మీరు ఎప్పుడైనా నావైపు ప్రేమగా చూశారా ? చూడలేదుకదూ.. మా పరిస్థితి పట్టించుకున్నారా ఎప్పుడైనా ? మమ్మల్ని అంటే రైలు పట్టాలను ఇనుప కడ్డీలుగా చూస్తున్నారేకానీ, మాకూ హృదయం ఉంటుందని ఎందుకు అనుకోరు. `ఇనుములో హృదయం మొలిచెలె’ అన్న పాట తెలుసుగా మీకు, మా ఇనుప హృదయకవాటాలు తెరుచుకున్నాయని ఎందుకు అర్థంచేసుకోరు.

ఇంతకీ మిమ్మల్నందర్నీ ఇప్పుడు ఎందుకు రమ్మన్నానో తెలుసా? మధ్యప్రదేశ్ లో జంటరైళ్ల ప్రమాదం గురించిన కొన్నివాస్తవాలు మీతో షేర్ చేసుకుందామని.

ముంబయి – వారణాశి కామయాని ఎక్స్ ప్రెస్ , జబల్పూర్ – ముంబయి జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ల 17 బోగీలు క్షణాల వ్యవధిలో పట్టాలుతప్పడం, అనేకమంది ప్రాణాలుకోల్పవడం…ఇదంతా మీకు తెలుసు. అసలు ఇలాంటి వార్తకి `ఉప్పు’ అందగానే పరిగెత్తుకుంటూ వచ్చేది మీరే. మీ తర్వాతనే అధికారులు వస్తున్నారు. నాదో డౌటూ, ప్రయాణ భద్రత కల్పించాల్సినఅధికారులేమో లేటుగా వస్తుంటే, మీరు ఛటక్కున ఎలా వాలిపోతున్నారు? విధులపట్ల మీకున్న సిన్సియారటీ వారికి లేదనుకోవాలా ? చెప్పండి మీడియా బాబులూ…

సరే, మళ్ళీ అసలు విషయానికి వస్తాను, ఆయన ఎవరు? ఆఁ రైల్వే చైర్మన్ ఏకే మిత్తల్ ని మీరు కలిసి ఎందుకిలా జరిగిందని అడిగితే, సదరు పెద్దాయన ఏం చెప్పాడో గుర్తందికదామీకు.

హఠాత్తుగా వరదనీరు వచ్చేసిందట. అంతవరకు పట్టాలు (అంటే మేము) బాగానే ఉన్నామట, హన్నన్నా…! ఎంత విడ్డూరం. బాధ్యతనుంచి ఎంత తొందరగా తప్పించుకోవాలని చూశాడాపెద్దాయన. పట్టాలు వరదనీటివల్లనే వీకైఉండవచ్చు. నీటి రాపిడికి పట్టాల కింద మట్టి కొట్టుకుపోయీఉండవచ్చు. అయితే, అలా జరగడంలో రైల్వే వారి తప్పులేదా అన్నది నా ప్రశ్న. పైనఎక్కడో డ్యామ్ ఉంటే.. వాళ్ళు నీళ్లు దిగువకు వదిలేస్తుంటే, ఆ విషయం రైల్వే అధికారులకు తెలియదా అంటా? రెండు శాఖల మధ్య సమన్వయంలేనప్పుడు పట్టాలు తప్పాయని అడ్డంగా వాదించడమేమిటి ?. ఉరుమురిమి మంగళంమీద పడినట్టు వాళ్లు నిద్రపోతూ, ఆధునిక సౌకర్యాలను తుంగలోకి తోక్కేస్తూ ప్రమాదం జరిగినతర్వాత మమ్మల్ని ఆడిపోసుకోవడం ఇక్కడ మనదేశంలోనే చెల్లింది. అదే వేరే దేశంలో అయితే తోలుతీసేసేవారు. జీపీఎస్ లు ఏమయ్యాయంట, పాజిటీవ్ ట్రైయిన్ కంట్రోల్ ప్రాజెక్టలమాటేమిటంట ? ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు లబోదిబోఅంటే సరిపోతుందా ? పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా ? వీళ్లదిమ్మడ, ఉపగ్రహాలు పైన తిరుగుతూనే ఉన్నాయి కదా, సాంకేతిక పరిజ్ఞానం బాగానే ఉందికదా, ఎందుకని వాడరన్నది నా సూటి ప్రశ్న. ఉన్నతాధికారులు, ఇంకా పెద్దోళ్లూ విదేశాలకు స్టడీటూర్లకు వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారో చెప్పమని మీరు నిగ్గదీయండి. జపాన్ , చైనాలో పట్టాలమీద రైళ్లు సురక్షతంగా పరిగెడుతుంటే, ఇక్కడ రైలెక్కాలంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారో కడిగేయండి.

`పట్టాలుతప్పింది, పట్టాలుతప్పిందం’టూ ఊరికే అరిచే బదులు, మనదేశ మొత్తం రైలుమార్గాన్ని సురక్షితం ఎందుకు చేయరో నాకు అర్థంకావడంలేదు. మీకుచేతకాకపోతే ప్రైవేట్ పరంచేయండి. వాళ్లన్నా సరిగానడిపి ప్రయాణీకులకు భద్రత కల్పిస్తారు. అమ్మపెట్టదూ, అడుక్కుతిననివ్వదూ అన్నట్టు ఉందీవాళ్ల సంగతి.

వంతెనల వయస్సు వందేళ్లు దాటినా వాటిపైనే ఇంకా రైళ్లను నడిపిస్తుంటారు, పట్టాల కింద సపోర్ట్ మట్టి తగ్గిపోతున్నా పట్టించుకోరు, ఎప్పటికప్పుడు రైలు వెళ్లగానే `అమ్మయ్యా, ఇవాళ్టికి పనైపోయింద’ని చేతులు దులుపుకుంటారు. కనీసం పట్టాలను పటిష్టపరచలేనివారు ప్రయాణీకులకు అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామంటూ బోడి హామీలేమిటి.. చిరాకేస్తోంది. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట. అట్టుంది వీరి వ్యవహారం.

ప్రమాదాలకు పట్టాల తప్పుకాదు, వరదనీరు రావడమూ తప్పుకాదు, తప్పు అధికారులదే. వారి అలసత్వం వల్లనే ఏటా వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు.

కాబట్టి మైడియర్ మీడియా వాళ్లారా, ఇదంతా రాయండి, మీ టీవీల్లో చూపించండి. ప్రమాదం జరిగినప్పుడు మీ రేటింగ్స్ కోసం తపనతో కవరేజ్ లు ఇవ్వడంగాదు, అంతే స్పీడ్ తో నిజాన్ని బయటపెట్టండి. లేకపోతే మీకూ, నిదరబోతున్న అధికారులకూ తేడఉండదు. ఏదో రైలుపట్టా చెబితే మేము కవర్ చేయడమేమిటని ఉపేక్షించారో మరో ప్రమాదం పొంచిఉంటుంది. ప్రయాణీకుల ప్రాణాలుగాలిలో కలిసిపోతాయి. ఆ పరిస్థితి రానీయకండి. మా గుండె చప్పుడు లోకానికి తెలియజేయండి.. ప్లీజ్.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.. డీజీపీ పర్మిషన్ ఇచ్చారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో... చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే...

జగ్గారెడ్డి, టీవీ9 మీద ఈగ వాలనీయడం లేదుగా..

జగ్గారెడ్డి అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేత. అధికారంలో ఉన్న కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యుల మీద పదునైన విమర్శలు చేయడానికి విపక్ష నేతలు భయపడుతూ ఉన్న సమయంలో కూడా జగ్గారెడ్డి...

ఎల్జీ పాలిమర్స్‌ కేసులో ఆ వివరాలన్నీ చెప్పాలన్న హైకోర్టు..!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై... హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేయడంతో పాటు.. హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై .. విచారణ జరిపి... అనేక...

బాపట్ల ఎంపీ..మందడంలో భూమాయ..!?

కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close