ప‌వ‌న్ ద‌ర్శ‌కుడితో బెల్లంకొండ‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను నిరూపించుకొన్నాడు… సాగ‌ర్ చంద్ర‌. ఓ సూప‌ర్ హిట్ సినిమా రీమేక్ ని తెర‌కెక్కించ‌డం ఒక ఎత్త‌యితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల అంచ‌నాల్ని అందుకోవ‌డం మ‌రో ఎత్తు. ఈ విష‌యంలో సాగ‌ర్ చంద్ర‌కు పూర్తి మార్కులు ప‌డ్డాయి. త్రివిక్ర‌మ్ నీడ‌లో కూడా… త‌న ఉనికిని చాటుకొన్నాడు సాగ‌ర్. అయితే… ఆ హిట్ కి త‌గిన ప్ర‌తిఫ‌లం రాలేదు. సాగ‌ర్ చంద్ర త‌దుప‌రి సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాలేదు. ఫ‌లానా హీరోతో సాగ‌ర్ చంద్ర సినిమా ఉందంటూ గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. అయితే అవేం ఇప్ప‌టి వ‌ర‌కూ ఖ‌రారు కాలేదు. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… సాగ‌ర్ చంద్ర ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే బెల్లంకొండ‌కు క‌థ చెప్పేశాడ‌ని, బెల్లంకొండ కూడా ఓకే చేశాడ‌ని వార్త‌లొస్తున్నాయి. బెల్లంకొండ ప్ర‌స్తుతం `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. తెలుగులో కొత్త‌గా రెండు సినిమాలు చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని టాక్‌. అందులో సాగ‌ర్ చంద్ర సినిమా ఒక‌టి. త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close