వైసీపీలో కుట్ర సిద్ధాంత నిపుణుడిగా పేరు పొందిన సజ్జల దగ్గర కూడా సరుకైపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఓ సారి అంటే.. ప్రజల్ని నమ్మించవచ్చుకానీ ప్రతీ సారి ఒకే రకమైన ఫార్ములా ఆరోపణలతో నమ్మించడం కష్టం. ఈ విషయం ఆయనకూ అర్థమవుతోంది కానీ … అంతకు మించి ఆయనకు ఐడియాలు ఇచ్చేవాళ్లు దొరకడం లేదేమో .. కీచుగొంతుతో అవే ఆరోపణలు చేస్తూ..సాక్షి పత్రికలో రాయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయిన విషయం కళ్ల ముందు ఉంది. సిబీఐ సిట్ నిర్దారించింది. కల్తీ మద్యం కేసులో నాలుగు వందల కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మొత్తం వెయ్యి కోట్ల మనీలాండరింగ్ ను గుర్తించినట్లుగా ప్రకటించింది. ఇంకా తీగలాగుతున్నామని .. కింగ్ పిన్ను బయటకు తీస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ మెడకు చుట్టేసుకుని ఊపిరి ఆడని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూంటే ..ఆయన ప్రెస్మీట్లు పెట్టి.. టీటీడీ నెయ్యి టెండర్లపై ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీ నెయ్యి టెండర్ల కోసమే ఈ ఆరోపణలు అని విచిత్రమైన లాజిక్ చెబుతున్నారు.
జగన్ రెడ్డి రెండు పెళ్లిళ్లకు వెళ్లి ఈ వారం బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో పార్టీ వైపు నుంచి ఏదో ఒకటి ఉండాలని.. ఆయన ప్రెస్మీట్ పెట్టినట్లుగా ఉన్నారు. ఏం చెప్పాలో తెలియక.. సాక్షిలో కథలు చెప్పేసి వెళ్లిపోయారు. ఓ వైపు కల్తీ నెయ్యి కేసు.. మరో వైపు మద్యం కేసు.. మెల్లగా చుట్టుముట్టడానికి వస్తున్నాయని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఎంత బురద చల్లితే అంత అన్నట్లుగా .. మాట్లాడేస్తున్నారు.
