త్రీడీలో శాకుంత‌లం… అందుకే ఆల‌స్యం

గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల చిత్రం ‘శాకుంత‌లం’. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌యింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద‌గా అప్ డేట్లు రావ‌డం లేదు. రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి స్ప‌ష్ట‌తా లేదు. ఆమ‌ధ్య న‌వంబ‌రు 4న ఈ చిత్రాన్ని తీసుకొస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది. అయితే.. ఇప్పుడు నంబ‌రు 4న కూడా రావ‌డం లేదు. ఈ సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది. దానికి కార‌ణం… శాకుంత‌లంని త్రీడీ టెక్నాల‌జీలో మార్చ‌డ‌మే. ఈ సినిమాని ఇప్పుడు త్రీడీలో చూపించాల‌ని గుణ‌శేఖ‌ర్ నిర్ణ‌యం తీసుకొన్నాడు. అందుకే ఈ సినిమా విడుద‌ల తేదీ మళ్లీ వాయిదా ప‌డింది.

ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం కూడా ధృవీక‌రించింది. త‌మ ప్ర‌య‌త్నాన్ని భారీ ఎత్తున, స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అందుకే శాకుంత‌లం ఆలస్యం అవుతోంద‌ని, త్వ‌ర‌లోనే కొత్త విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామ‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. మోహ‌న్ బాబు, ప్ర‌కాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్ర‌మిది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

అనిల్ రావిపూడి – బాల‌య్య‌… ముహూర్తం ఫిక్స్‌

`ఎఫ్ 3` త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ తో ఫిక్సయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి.. బాల‌య్య...

కొరియోగ్రాఫ‌ర్‌ని హీరో చేస్తున్న దిల్ రాజు

ర‌చ‌యిత‌లు మెగాఫోన్ ప‌ట్ట‌డం ఎంత కామ‌నో... డాన్స్ మాస్ట‌ర్లు డైరెక్ట‌ర్లుగా, హీరోలుగా మార‌డం కూడా అంతే కామ‌న్‌. ప్ర‌భుదేవా, లారెన్స్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. ఇలా హీరోలైన వాళ్లే. జానీ మాస్ట‌ర్ కూడా త్వ‌ర‌లోనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close