సమ్మోహనం : సమీక్ష

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

అరిటాకులో అందంగా అన్ని ఆధరవులు పేర్చి ఫోటో తీస్తే చాలా
అందంగా వుంటుంది.
కానీ అలా అని అరిటాకులో భోజన అందరికీ చేతకాదు.
నచ్చకపోవచ్చు.
అలా అని బాగాలేదు అనేయలేదు. అదో అందం. అంతే.
సమ్మోహనం సినిమా కూడా అంతే.

తారలు దూరంగా వుంటాయి.
అందితే బాగానే వుంటుంది.
అందకుంటే బాధగా వుంటుంది.
కానీ సదా వెలుగుతూ వుంటే తారల వెనకాల చీకటే వుంటుంది.
ఆ చీకటి కూడా ప్రేమించగలిగితేనే, తారలతో ప్రేమ సమ్మోహనంగా వుంటుంది.

సినిమా అంటేనే సమ్మోహనం. అందుకే కావచ్చు.. సినిమా ప్రపంచం చుట్టూ తిరిగే కథ రాసుకుని, దానికి సమ్మోహనం అని పేరు పెట్టి, సినిమాగా మార్చి జనం ముందుకు తెచ్చాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సున్నితమైన హాస్యానికి, అంతకన్నా సున్నితమైన ప్రేమకథలకు పేటెంట్ అనుకునే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అందించిన సినిమానే సమ్మోహనం. సుధీర్ బాబు హీరో, అదితి రావ్ హైదరి కథానాయిక. అందమైన పోస్టర్లు, ఎలా వుంది మరి సినిమా..ఓ లుక్కేద్దాం.

పిల్లల కథలకు బొమ్మలు వేసి, వారిలో సృజనను పెంచాలనే ఆలోచన విజయ్ కుమార్ (సుధీర్ బాబు)ది. సినిమాలన్నా, అందులో నటించేవారన్నా పిచ్చంటే పిచ్చ అతని తండ్రి శర్వా (నరేష్)ది. తల్లి, చెల్లి, అందమైన కుటుంబం వాళ్లంది. అలాంటి వాళ్ల ఇంటికి షూటింగ్ కోసం వస్తుంది ఓ సినిమా యూనిట్. ఆ సినిమాలో హీరోయిన్ సమీర (అదితిరావ్ హైదరి) సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె ఇంట్లోకి రావడంతో అజయ్ జీవితమే మారిపోతుంది. అనుకోకుండా ఆమెకు దగ్గరవుతాడు. షూటింగ్ పూర్తియి వెళ్లిపోయినా, ఆమెను మరిచిపోలేకపోతాడు. నేరుగా వెళ్లి ఐలవ్యూ అంటూ చెప్పేస్తాడు. కానీ ‘సారీ..నేను నిన్ను ఆ దృష్టితో చూడలేదు’ అంటుంది సమీర. అంతవరకు విజయ్ కు సన్నిహితంగా వచ్చిన సమీర ఎందుకలా? అన్నది? తరువాత ఏమయింది అన్నది మిగిలిన సినిమా.

సమ్మోహనం సినిమా కథ చాలా చిన్నది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కథే కాదు, కథనం కూడా చిన్నదే. ఓ అందమైన కుటుంబం. మంచి అబ్బాయి. హీరోయిన్ కు దగ్గరయ్యాడు. ప్రపోజ్ చేసాడు. నో అంది. ఆ తరువాత ఎందుకు అలా అన్నది అన్నది తెలిసింది. ఆ సమస్య సాల్వ్ చేసాడు.కథ కంచికి. మనం ఇంటికి. ఇంతే. థిన్ లైన్ స్టోరీకి, అంతకన్నా చిన్న కథనాన్ని సమకూర్చి, రెండు గంటల సినిమా తీయడం అంత సులువుకాదు. కేవలం ఇంద్రగంటి కాబట్టి, తనదైన స్లో పేస్ టేకింగ్ తో తీసి, మెప్పించాడు.

కానీ ఈ సుతారంగా సినిమాను చెక్కడం అన్నది ఎంత మందికి నచ్చుతుందన్నది వేరే ఫ్రశ్న. వేరే దర్శకుడు అయి వుంటే, ఈ సినిమాలో వున్న పాయింట్ చుట్టూ వేరే విధంగా కథ అల్లుకునేవాడు. ఈ సినిమాలో వున్న సీన్లలో ముప్పాతిక సీన్లు లేచిపోయి వుండేవి. అంటే ఈ సినిమాలో వున్న సీన్లు కానీ, ఈ సినిమా ఈ విధంగా వుండడం కానీ కేవలం ఇంద్రగంటి స్టయిల్. ఇది ఆయన సినిమా. ఆయన సినిమాలు నచ్చేవారికి మాత్రం నచ్చే సినిమా.

సినిమా తొలిసగం మొత్తం కలిపి ఇరవై రోజుల వ్యవహారం అనుకోవాలి. కథనాయకుడి ఫ్యామిలీ, ఒక ఇంటిని షూటింగ్ ఇస్తే ఎలా వుంటుంది? సినిమా వాళ్ల వ్యవహారాలు? జనాలను వాళ్లు ఎలా వాడేస్తారు? ఇలాంటి వాటితో తొలిసగాన్ని అత్యంత సులువుగా, చాకచక్యంగా, సరదాగా లాగించేసారు దర్శకుడు ఇంద్రగంటి. తొలిసగం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం ఇంద్రగంటి అభిమానులను మాత్రమే కాదు. అందులో సందేహం లేదు. తొలిసగంలో వచ్చే రెండు పాటలు నెమ్మదిగా వున్నా ఆకట్టుకుంటాయి. తొలిసగం అంతా హృద్యంగా, సమ్మోహనంగానే సాగుతుంది.

అయితే సినిమా మలిసగంలోకి వచ్చేసరికి, ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు ఏర్పడతాయి. అప్పటి వరకు హీరో, హీరోయిన్ లను, వారి వైఖరిని, వారి ఆలోచనా విధానాన్ని చూపించిన తీరు చూసి, ద్వితీయార్థం అంతా మాంచి కాన్ ఫ్లిక్ట్ తో నడుస్తుందని, ఎమోషన్లు పీక్స్ లో పండుతాయని అనుకుంటారు. కానీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇక్కడ కథనాన్ని లైట్ తీసుకున్నారు. అంటే లైట్ గా తీసుకున్నారని కాదు, ప్రేక్షకులను మరీ గుండెలు పిండేసేంత ఎమోషన్ లో ముంచేయకుండా లైట్ తీసుకున్నారు. జస్ట్ నాలుగు నిమషాల హరితేజ నేరెషన్ తో కథ లోని చిక్కు ముడి మొత్తం విప్పించేసి, కథను క్లయిమాక్స్ దిశగా నడిపించేసాడు. ఇది ఒక్కటే కాస్త అసంతృప్తి తప్ప, మరేమీ వుండదు. అయితే ఈ అసంతృప్తిని క్లయిమాక్స తుడిచేస్తుంది. అమీతుమీ తరువాత మళ్లీ క్లయిమాక్స్ పది నిమషాలు హిలేరియస్ గా వుండడం ఇంద్రగంటి సినిమాలో ఇదే. చిన్న ఎక్స్ టెండెడ్ క్లయిమాక్స్ కూడా ఇంద్రగంటి మార్కుతోనే వుంటుంది.

సినిమాలో పాత్రలు చాలా లిమిటెట్. నరేష్, పవిత్రా లోకేష్, సుధీర్ బాబు, అదితీరావ్ హైదరీ వీళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. తనికెళ్ల, రాహుల్ రామకృష్ణ మరి కొన్ని పాత్రలు సపోర్టింగ్ గా నిలుస్తాయి. ఇంద్రగంటి దగ్గర వున్న చమక్కు ఏమిటంటే, సరైన వాళ్లనే తీసుకుంటాడు. వాళ్ల దగ్గర నుంచి సరైన నటన తీసుకుంటాడు. అందుకే సినిమాలో ప్రతి పాత్ర బాగా నటించినట్లు అనిపిస్తుంది. తల్లీ కొడుకుల సీన్ లో పవిత్రా లోకేష్ శహభాష్ అనిపించుకుంటుంది. సుధీర్ బాబు చేత మంచి నటన రాబట్టుకోవడం మాత్రమే కాదు, అవసరమైనపుడు లో టోన్ లో, హస్కీ వాయిస్ లో చాలా బాగా డైలాగులు చెప్పించాడు. అదితీరావ్ కు పాత్ర తక్కువే. సుధీర్ బాబుతో చూసుకుంటే, కానీ అతనితో సమానంగా చేసిందని అనిపించుకుంటుంది.

సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సంభాషణలు చాలా ప్లస్ అయ్యాయి. అలాగే వివేక్ సాగర్ పాటల, నేపథ్య సంగీతం కూడా. విందా సినిమాటోగ్రఫీ కచ్చితంగా అందంగా వుంటుంది.

చివరకు చెప్పేది ఒక్కటే.

అంతా బాగున్నా, ఈ స్టయిల్ ఆఫ్ టేకింగ్, మేకింగ్ అర్బన్ ఆడియన్స్ కు పట్టినట్లు సి సెంటర్ ఆడియన్స్ కు పడుతుందా అన్నదే చిన్న అనుమానం. ఆ గీత దాటితే సమ్మోహనం నిజంగా సమ్మోహనమే

ఫైనల్ టచ్..స్లో అండ్ స్టడీ సమ్మోహనం

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

ఆర్ మార్తాండ శర్మ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close