‘వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్.. పిచ్చోళ్ళు అయిపోయారు అంతా’ సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా కోసం రాసుకున్న డైలాగ్ ఇది. ఆ సీన్, ఈ డైలాగ్ వైరల్ అయిపోయాయి. ఇప్పుడీ డైలాగ్‌ని సందీప్ రెడ్డి వంగా కోసం వాడాల్సివస్తుంది. ఎందుకంటే ఆయన విజన్, థాట్ ఆ రేంజ్లో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్నాడు సందీప్. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ కాలేదు. అయినప్పటికీ మ్యూజిక్ విషయంలో 70 శాతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశాడు వంగా. తనకి ఎలాంటి బీజీఎం కావాలో అప్పుడే క్రియేట్ చేసుకున్నాడు. విత్ బీజీఎం తో షూట్ చేయాలనేది సందీప్ విజన్. ఇలా చేస్తే అనవసరమైన షాట్లు తీయాల్సిన అవసరం లేదు. షూటింగ్, ఎడిటింగ్ టేబుల్ దగ్గర బోలెడు సమయం ఆదా అవుతుంది.
సందీప్ విజన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఓవర్సీస్కి కాపీలు పంపుతున్న సమయంలో కూడా ఇంకా ఆర్ఆర్తో కుస్తీ పడుతుంటారు కొందరు ఫిల్మ్ మేకర్స్. మ్యూజిక్ విషయంలో గ్రిప్ లేకపోవడం ఒక కారణమైతే, టేకింగ్‌లో క్లారిటీ లోపించడం ఇంకో రీజన్.
అయితే కొంతమంది మోడరన్ ఫిల్మ్ మేకర్స్ ఎడిట్ కట్ని మైండ్‌లో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దీనికి ఆద్యుడు. ‘శివ’ ఫుటేజ్కి ఫైనల్ కట్‌కి నిమిషం కూడా తేడా ఉండదని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు వర్మ. పూరి జగన్నాథ్ ఇదే బాటలో నడిచి కొబ్బరికాయ కొట్టిన రోజే రిలీజ్ డేట్ చెప్పేవారు.
సందీప్ మాత్రం బీజీఎం టైమ్‌లైన్‌ని కూడా ఫిక్స్ చేసుకోవడం నెక్స్ట్ లెవల్. సందీప్ ఎడిటర్ కూడా. ఎడిటర్ డైరెక్టర్ అయితే చాలా సౌలభ్యం ఉంటుంది. సీన్లో ఎమోషనల్ డెప్త్ ముందే అందేస్తుంటుంది. తనకి ఆర్ఆర్ మీద కూడా మంచి పట్టుంది. తన సినిమాల్లో బీజీఎం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు స్పిరిట్ లో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.