హైదరాబాద్‌లో అయితే కష్టం.. హైదరాబాద్‌కు దగ్గర అయినా పర్వాలేదు అనుకునే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండటం లేదా… అద్దెల ఆదాయం కోసం ఓ ఇంటిని కొనుగోలు చేసి పెట్టుకోవడం చాలా మంది లక్ష్యం. ఇలాంటి వారు చాలా మంది విస్తరిస్తున్న హైదరాబాద్ లో తర్వాత అయినా భాగం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ ఇరవై ఏళ్ల తర్వాత .. ఓ పదిహేనేళ్ల తర్వాత అయితే ఎలా ఉంటుందని ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇలాంటి వారికి ఉన్న పలు ఆప్షన్స్‌లో సంగారెడ్డి బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు. సంగారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ శివారుగా మారింది. ఎంతగా ఉంటే.. సంగారెడ్డి వరకూ మెట్రో వేయాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బీహెచ్ఈఎల్ శివారు ప్రాంతం.. ఇప్పుడు అది సెంటర్ లోకి వచ్చింది. అక్కడ్నుంచి సంగారెడ్డికి మధ్య ఎన్నెన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా సిటీలో కలిసిపోయేలా .. చేసేలా పరిశ్రమలు, ఐఐటీ సహా పలు ప్రముఖ సంస్థలు వచ్చాయి.
సంగారెడ్డి రోజూ హైదరాబాద్ కు వేల మంది అప్ అండ్ డౌన్ చేస్తూంటారు. అంటే హైదరాబాద్ లో పని చేసే వారికి కూడా సంగారెడ్డి నివాస కేంద్రంగా మారిందని అనుకోవచ్చు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకూ నివాస అనుకూల కాలనీలు ఉన్నాయి. అన్ని చోట్ల ఐటీ కారిడార్ తో పోలిస్తే సగం ధరకే ఇళ్లు వస్తున్నాయి. నలభై లక్షలకు అపార్టుమెంట్లు, 80 లక్షలకు విశాలమైన ఇండిపెండెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇపుడు పెట్టుబడి పెట్టి పదేళ్ల తర్వాత దాని విలువను అంచనా వేసుకుంటే ఎవరూ ఊహించనంతగా పెరుగుతుందన్న అంచనాలు రియల్ వర్గాల్లో ఉన్నాయి.