పవర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి కానుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి సందర్భంగా తన అభిమానుల కోసం ప్రస్తుతం నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ టీజర్ ను విడుదల చేశారు. లుంగీ మీద మాస్ లుక్ తో అదరగొడుతున్న ఈ టీజర్ తో సంక్రాంతి విశెష్ ని తెలిపాడు మన గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమా ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సినిమా ఓ ట్రెండ్ సృష్టించింది.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా సర్ధార్ గబ్బర్ సింగ్ తో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన భారీ సెట్ కూడా వేశారు. పవర్ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న బాబి (రవిందర్) సర్ధార్ గబ్బర్ సింగ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పిస్తున్న ఈ సినిమా నార్త్ స్టార్ నిర్మాణ సారధ్యంలో శరత్ మారర్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టీజర్ మాత్రం అదరగొట్టేస్తుంది. సంక్రాంతికి టీజర్ తో వచ్చిన పవన్ సమ్మర్ లో సినిమాతో రాబోతున్నాడు. మొన్నటిదాకా గుజరాత్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మీద అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com