బెంగళూరు కోకాపేటగా సర్జాపూర్ రోడ్ మారుతోంది. ఐటీ ప్రొఫెషనల్స్, NRIలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తూండటంతో భారీ డిమాండ్‌తో, ఈ ప్రాంతంలో ఇంటి ధరలు గణనీయంగా పెరిగాయి. 2020లో చదరపు అడుగుకు రూ. 5,000 ఉండేది. ఇప్పుడు 2025లో 12,000కి చేరింది. గత ఐదేళ్లలో రెట్టింపు కన్నా ఎక్కువ రుగుదల జరిగిన ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
సర్జాపూర్ రోడ్, బెంగళూరు ఈస్ట్‌లో ఒక ఎమర్జింగ్ మైక్రో-మార్కెట్‌గా, ఐటీ కారిడార్‌గా మారింది. ఇక్కడ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అక్సెంచర్, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి గ్లోబల్ జెయింట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలకు సమీపంలో ఉండటంతో ఉద్యోగులు ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు. సర్జాపూర్ రోడ్ లో ఉన్న పలు ఏరియాల్లో ఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ , లగ్జరీ విల్లాలు నిర్మాణం జరుగుతోంది. గ్రీన్ స్పేసెస్, ఎకో-ఫ్రెండ్లీ డిజైన్స్ , స్మార్ట్ హోమ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
సర్జాపూర్ రోడ్లో ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం – అద్భుతమైన కనెక్టివిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఔటర్ రింగ్ రోడ్ (ORR), అప్‌కమింగ్ పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR), సాటెలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR)తో, ఎయిర్పోర్ట్ , సిటీలోకి వెళ్లేందుకు సమయం కలసి వస్తుంది. మెట్రో ఫేజ్ 3Aలో సర్జాపూర్-హెబ్బల్ లైన్ ప్రతిపాదనలో ఉంది, ఇది వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి హబ్‌లకు ఈజీ యాక్సెస్ ఇస్తుంది. బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ 5-10% గ్రోత్ చూపుతుంది, సర్జాపూర్ రోడ్ దీనికి లీడర్.
